Monday, April 29, 2024

షరతులెందుకు?

- Advertisement -
- Advertisement -

Vinod kumar critisized on FRBM conditions

 

ఎఫ్‌ఆర్‌బిఎం పెంచుతూ నిబంధనలతో ముందరి కాళ్లకు బంధాలు వేయడం సరికాదు
ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం, కేంద్రం అంకెల గారడీ : బి. వినోద్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచిన కేంద్ర ప్ర భుత్వం ఆ మేరకు రుణాలు తీసుకునేందు కు ముందస్తు నిబంధనలు పెట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మెన్ బోయినపల్లి వి నోద్ కుమార్ విమర్శించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆదివారం ప్రకటించిన ప్యాకే జీ వివరాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. వాస్తవానికి ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంచాలని రాష్ట్రాలు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నాయని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పెంచడం సరైన విషయమే అయినప్పటికీ నిబంధనలు పెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో కరోనాను ఎదుర్కొవాలా లేక కేంద్ర ప్రభుత్వం చెబుతున్న సంస్కరణలు పట్టించుకోవాలా అని ప్రశ్నించారు. ఇది రాష్ట్రాలకు అదనపు భారంగా మారుతోందన్నారు. కేంద్రం 10 శాతం జిడిపిని ప్రకటించినట్లు గొప్పగా చెప్పుకుంటుందని, అయితే కేవలం 1.5 శాతం మాత్రమే భరిస్తుందని పేర్కొన్నారు. అంటే కేవలం రూ.3.20 లక్షల కోట్లు మాత్రమే.

మిగతా మొత్తం అంటే 85 శాతం ప్యాకేజిని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, నాబార్డు భరించబోతున్నాయన్నారు. మొ త్తం ప్యాకెజీలో కొత్త, పాత లింక్ట్ స్కీమ్ విలు వ రూ.9.74 లక్షల కోట్లుగా చెప్పారు. అ మెరికాలో ఇచ్చిన దానికన్నా ఇది చాలా తక్కువ మొత్తంగా తెలిపారు. గత ఐదు రోజులుగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ అంకెల గారడీతో కేంద్రం మోసం చేస్తూ వస్తుందనేది స్పష్టమౌతోందున్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించడానికి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. అయితే కేంద్రం మాత్రం క్లిష్ట సమయంలో అనేక సంస్కరణలను రాష్ట్రాల మీద మోపడం భావ్యం కాదని పేర్కొన్నారు. అసలే కొవిడ్ 19తో సంక్షోభంలో ఉన్న రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు అస్సలు బాలేదని, ఇప్పటికైనా క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించే దిశగా ఉపశమన చర్యలు ఉండాలని కోరారు.

అలాగే పార్లమెంట్‌లో చర్చ లేకుండానే కరోనా సంక్షోభాన్ని అదునుగా తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ పాత్రను కేంద్రం విస్తరిస్తోందని వినోద్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. కొవిడ్ నేపథ్యంలో కంపెనీలకు డిక్రిమినైలైజ్ చేయడం కూడా సాధారణ విధాన నిబంధనలుగా ఆయన పేర్కొన్నారు. కరోనా తరువాత సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్రం ఆరోగ్య, విద్యా రంగాలలో తీసుకునే చర్యలు అవసమని, వాటిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వలస కార్మికులకు ఉపాధి హామీ ఎలా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లు ఇళ్లు వదిలి వేరే రాష్ట్రాలలో పనిచేస్తారని, గ్రామాలను వదిలేస్తారని ఎలా అమలు సాధ్యమవుతుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News