Sunday, May 5, 2024

పంటలపై నేడు సిఎం వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

CM KCR review on Agricultural Policy

 

సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్రస్థాయి సమీక్ష
జిల్లా కలెక్టర్లు మొదలు.. మండల అధికారులు, గ్రామ రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లతో చర్చ
వానాకాలం పంటల సాగుపై దిశానిర్ధేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితిల అధ్యక్షులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం భారీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. విసిలో ఉన్న ప్రధాన ఎజెండా అంశాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సాగు చేయాల్సిన వరి మేలు రకం విత్తనాలు మండలాలు, గ్రామాల వారీగా, మొక్కజొన్న ప్రత్యామ్నాయ పంటలు సాగు, కంది పంట, ఆయిల్‌పామ్, నూనె గింజల విస్తీర్ణం పెంచడానికి అనుకూలమైన మండలాలు, గ్రామాలు, పచ్చిరొట్టను ప్రోత్సాహించడం, విత్తనాల, ఎరువుల సరఫరా అందుబాటులో ఉన్న విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు అందించేందుకు టాస్క్‌ఫోర్స్ పనితీరు పరిశీలన వంటి వాటిపై సిఎం చర్చిస్తారు. అలాగే నియంత్రిత పంటల విధానంపై సూచనలు, సలహాలు స్వీకరించనున్నారు. జిల్లాలు, మండలాల వారీగా పంటల మ్యాపింగ్‌పై సమీక్షిస్తారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, అనుబంధ రంగాలకు సంబంధించిన ఉన్నతాధికారులు, జిల్లా వ్యవసాయాధికారులు, ఉద్యాన అధికారులు, ఎడిఎలు, మార్క్‌ఫెడ్ మేనేజర్లు, అగ్రోస్ రీజినల్ మేనేజర్లు, విత్తన కార్పొరేషన్ జిల్లా మేనేజర్లు, జిల్లా సహకార శాఖ అధికారులు, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్లు, మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి, ఉద్యాన అధికారి, స్టాటిస్టికల్ ఆఫీసర్, మండల, గ్రామ రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు పాల్గొంటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News