Friday, April 19, 2024

విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర రెడ్డి గార్డెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా జరిగిన విద్యుత్ విజయోత్సవాలు విద్యుత్ ప్రగతి కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో విద్యుత్ అధికారులు తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ శాఖ సాధించిన ప్రగతి నివేదికను ప్రవేశపెట్టారు.

అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే విద్యుత్ తీగల మీద బట్టలు ఎండ వేసుకునే పరిస్థితి వస్తుందని ఆంధ్ర రాష్ట్ర పాలకులు ఎద్దేవా చేసిన రోజులనుంచి, రైతులు రాత్రిపూట పంట పొలాలకు వెళ్లి పాముకాట్లకు తేలుకాట్లకి గురై ప్రాణాలు పోగొట్టుకున్న రోజులనుంచి, ప్రాణం పోయిన రూపాయి సాయం అందని రోజుల నుంచి, మోటార్ లు కాలిపోయి అర్థరాత్రి అపరాత్రి సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేసిన రోజుల నుంచి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ను ఇస్తున్న పరిస్థితి ఈ రోజు ఇంతటి ప్రగతిని సాధించిన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కష్టపడి పనిచేసే ఇంత ప్రగతిని సాధించిన క్రింది స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విద్యుత్ అధికారులు అందరికీ శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఇంతటి కృషిచేసి ఇంతటి విజయాలను సాధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కలవకుండా చంద్రశేఖర రావుకి మనమందరం అండగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News