Tuesday, May 21, 2024

సైనికుడి కుటుంబాన్ని ఆదుకుంటాం

- Advertisement -
- Advertisement -

కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు, మహబూబ్‌నగర్‌లో డబుల్‌బెడ్‌రూం

మన తెలంగాణ/హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని లడక్ లో గత గురువారం కొండ చరియలు పడి మృతి చెందిన మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వని కుంట తాండకు చెందిన హవల్దార్ పరుశురాం భౌతిక కాయానికి శనివారం నాడు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డిలు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ దేశ సేవలో అసువులు బాసిన పరుశురాం సేవలు మరువలేనివన్నారు. ఈక్రమంలో అమరవీరుడు పరుశురాం కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల ఆర్ధిక సాయం, మహబూబ్ నగర్ పట్టణంలో డబల్ బెడ్ రూమ్ ఇంటిని అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అమరవీరుడు పరుశురాం కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ సహాయంతో పాటు సైనిక సంక్షేమ నిధి నుండి నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తామన్నారు. ఇటీవల కాలంలో చైనా దురాక్రమణ లో అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని అదుకున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

Telangana Jawan killed in landslide in J&K

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News