Sunday, May 19, 2024

బడ్జెట్‌కు కరోనా కాటు

- Advertisement -
- Advertisement -

గణనీయంగా తగ్గిన రాష్ట్ర ఆదాయం
రెవెన్యూ మిగులు కష్టమేనని అనధికార సమాచారం
కొవిడ్ ఆంక్షలు తొలగించిన తర్వాత నెమ్మదినెమ్మదిగా పెరుగుతున్న రాబడి
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో 6వేల కోట్లు తగ్గిన ఆదాయం

Coronavirus Effect on Telangana Budget 2021-2022

మన తెలంగాణ/హైదరాబాద్: 2021-2022 ఆర్ధిక సంవత్సరానికి రూపొందించే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై క రోనా ప్రభావం తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు)లో కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, అభివృద్ధికి దిక్సూచిగా అమలవుతున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఈ ఏడాది మిగులు అనుమాన ంగానే కనిపిస్తోంది. కరోనా మహమ్మారితో కష్టకాలం, జిఎస్‌టితో కోల్పోతున్న పన్నుల రాబడితో నిర్ధేశిత రెవెన్యూ మి గులు కష్టం కానుందని ప్రచారం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా మార్చి నెల చివరి వారం నుంచి ఏప్రిల్, మే నెలలో రాష్ట్రం పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉంది. జూన్ నెల నుంచి స్వల్పంగా ఆ ంక్షలను సడలించినప్పటికీ రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం సమకూరలేదు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో పెద్దఎత్తున కదలిక రావడంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రం తిరిగి గాఢిలో పడుతో ంది. కాగా ఇదే సమయంలో కేంద్రం నుంచి వివిధ గ్రాంటుల రూపంలో రా వాల్సిన నిధులు కూడా రాష్ట్రానికి రాలే దు. పన్నుల రూపంలో కేంద్రం మంజూ రు చేయాల్సిన నిధుల్లో పెద్దఎత్తున కోత పడింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు కల్పిస్తున్న సంక్షేమ ప థకాలకు ఎటువంటి నిధుల కొరత ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. ప్రదానంగా వ్యవసాయం, నీటి పారుదల రంగంతో పాటు పెన్షన్లు, కళ్యాణలక్షీ, షాదీ ముబారక్, రైతు బీమా, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిపై భారీగా నిధులను వెచ్చించారు. ఈ నేపథ్యంలో రానున్న ఆర్ధిక సంవత్సరం కోసం వార్షిక బడ్జెట్ కూర్పుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జనవరిలో కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో వేగంగా కార్యచరణ చేస్తోంది. మార్చి రెండవ వారంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పద్దులు శాఖల వారిగా సిద్ధం చేసేలా ప్రణాళికలను రూపొందించింది. ఇందుకు దేశంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ఆదాయాలకు, కేంద్ర సాయాలను ప్రభుత్వం సమీక్షిస్తోంది.

కాగా ప్రస్తుత ఆర్ధిక ఏడాది మిగులు సాధన కష్టమని ప్రభుత్వం సైతం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల్లో గడిచిన 2019-2020 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్ర ఖజానాకు రూ. 39,608 కోట్లు రాగా, ప్రస్తుతం 2020-2021 ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ నాటికి రూ.33,704 కోట్ల రాబడి మాత్రమే సమకూరింది. వాస్తవానికి రాష్ట్ర ఆదాయ అభివృద్ధి రేటు 15శాతం అంచనా వేసి ప్రస్తుత వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. కానీ కరోనా కారణంగా నిర్దేశిత అంచనా వృద్ధి రేటు 15శాతం పెరగకపోగా, గత ఏడాది వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది ఏడు నెలల్లో ఖజానాకు చేరలేదు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం 67,608 కోట్ల ఆదాయం వస్తుందని అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందాయి. కానీ కేవలం రూ.33,704 కోట్లు మాత్రమే ఈ ఏడాది ఆదాయం సమకూరడంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం రూ.33, 904కోట్లు తగ్గనుంది. దీనిని ఎలా సర్దుబాటు చేయాలనే కోణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తర్జన, భర్జన పడుతోంది.
ఇక రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో తిరిగి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కూడా భారీగా తగ్గింది. రాష్ట్రానికి ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.16,727 కోట్ల పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్ర బడ్జెట్‌లో పొందుపరిచారు. దీని ప్రకారం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద రూ.8,363 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ.6,339 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కేంద్ర పన్నుల వాటా మొత్తంలో ఇప్పటికే రూ.2025 కోట్ల తగ్గుదల నమోదు అయింది. ఇక ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,727 కోట్లుకు గానూ కేవలం రూ.11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశముందని తెలుస్తోంది. దీంతో పన్నుల వాటా రూ.4,829 కోట్ల మేర కోత పడే అవకాశం కనిపిస్తోంది.
వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల (సిఎస్‌ఎస్) కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ.9,725 కోట్లు రావాల్సి ఉంది. దీని ప్రకారం అక్టోబర్ నెల వరకు 7 నెలల కాలానికి రూ. 5,673 కోట్లు రావాలి. కానీ ఇప్పుటి వరకు కేవలం రూ.4,592 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసింది. తద్వారా అక్టోబర్ మాసం వరకే రావాల్సిన నిధుల్లో రూ.1,081 కోట్ల మేర కోత పడింది. ఇదే విధానం అవలంభిస్తే ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 9,725 కోట్లకుగానూ రూ.8,923 కోట్లు మాత్రమే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో రూ. 802 కోట్లు కోత పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాధాన్యతలను నిర్ధారించుకుని ముందుకు వెళ్లాలని సిఎం కెసిఆర్ ఆర్ధిక శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రానికి మొత్తంగా ఈ వార్షిక ఏడాదిలో అన్ని రూపాల్లో కలిపి రూ.52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్ధిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. త్వరలో శాఖల వారిగా వ్యయాలు, కేటాయింపులను సమీక్షించాలని, ప్రాధాన్యత రంగాలకు నిధుల అంచనాలను చేస్తూనే, కోతల పట్ల స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు నివేదికలు సిద్దం చేయాలని ఆర్ధిక శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారని అధికార వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది.
దీంతో రానున్న ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిం చింది. ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులుగా కొత్త రూపు సంతరించుకున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు ఈ దఫా సరికొత్తగా రూపొందించ నున్నారని తెలుస్తోంది. ముఖ్యంగానిర్వహణ పద్దును అంచనాలు, ఊహజనితం కాకుండా వాస్తవాకితకు దర్పణం పట్టేలా సిద్దం చేయనున్నారు. ఇందుకు ప్రతి అంశంపై నిక్కచ్చిగా అధ్యయం చేసి వాస్తవికత ఆదారంగా పద్దులను రూపొందించ నున్నారు. ఉద్యోగుల వేతనాలు, ఫించన్లు, ఇతర ప్రభుత్వ నిర్వహణ, పాలనాపరమైన వ్వయాలు, ఖర్చులన్నింటిపై వాస్తవికతే కొలమా నంగా లెక్కించేందుకు ప్రభుత్వం తగు ఆదేశాలు సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే శాఖల వారిగా ఆదాయాలు, ఖర్చులు, నిర్వహణ వ్యయాలు, రాబడి వనరులపై కూలంకషంగా చర్చించిన మీదటనే పద్దులను ఖరారు చేయనున్నారు.

Coronavirus Effect on Telangana Budget 2021-2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News