Sunday, May 5, 2024

యాసంగి రైతుబంధు రేపటి నుంచి

- Advertisement -
- Advertisement -

యాసంగి రైతుబంధు రేపటి నుంచి

ఎకరానికి ఐదువేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ

Rs 18000 cr to be disbursed to over 9 cr farmers

మన తెలంగాణ/హైదరాబాద్: రేపటి నుంచి రాష్ట్రంలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి జనవరి 7వ తేదీ వరకు ఈ ప్ర క్రియ నిరాటంకంగా కొనసాగనుంది. ఈ మేరకు రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులను జమ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7300 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ యాసంగిలో కూడా ఎకరాకు రెండో దఫా నిధుల కింద రూ.5 వేల చొప్పున రైతు ఖాతాలో జమ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవసాయ, బ్యాంకు అధికారులతో ఇప్పటికే సమీక్షలు కూడా నిర్వహించారు. రైతు బంధుపథకం లబ్ధిదారులకు అందే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఈ నెల 7వ తేదీనే సిఎం కెసిఆర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ యాసంగీ పంట పెట్టుబడి సాయం కింద రూ. 5 వేల చొప్పున మొత్తం 58 లక్షలకు పైగా మంది రైతులకు రైతు బంధు పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. 2018-2019లో ఏటా రూ.12 వేల కోట్లగా ఉన్న బడ్జెట్ ను ఈ ఏడాది రూ.14వేల కోట్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు, వారికి అండగా ఉండేందుకు పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. 2018లో ప్రారంభించిన ఈ పథకం నిరంతరంగా కొనసాగుతోంది. మొదట ఎకరాకు రూ. 8 వేల చొప్పున రెండు దఫాలుగా పంపిణీ చేసిన సర్కార్..తర్వాత ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది. అయితే రైతు బంధు సొమ్మును గతంలో 36 గంటల్లోనే పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఈసారి కరోనా కారణంగా విడతల వారీగా బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తోంది.

విడుతల వారిగా జమ
మొదటి రోజున (ఈ నెల 28న) ఎకరంలోపు పొలమున్న రైతుల ఖాతాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు. ఇలాంటి రైతులు 25 లక్షల మంది ఉంటారని, వీరందరికీ మొదటి రోజు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. ఆ తర్వాత రెండెకరాలలోపు పొలమున్నోళ్లకు, ఆపై మూడెకరాలలోపు ఉన్నోళ్లకు పంపిణీ చేస్తారు. ఇలా విడతల వారీగా డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. వాస్తవానికి వానాకాలంలో కోటి 45 లక్షల ఎకరాలకు సంబంధించి 57.90 మంది రైతులకు రూ. 7,251 కోట్లు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేవారు. కానీ ఈ యాసంగికి కొత్తగా పాస్‌బుక్ వచ్చినవారు 1.70 లక్షల మంది కావడంతో ప్రభుత్వం రూ.7,300 కోట్లను విడుదల చేసింది.

TS Govt Released Rs 7300 Cr for Rythu Bandhu 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News