Wednesday, May 1, 2024

ఈటలకు మావోల లేఖ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీకి,ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తానని బిజెపి తీర్థం పుచ్చుకున్నాడని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం ఓ లేఖ విడుదల చేశారు. ఈటల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ తనకు మావోయిస్టుల మద్దతు ఉందని ఇచ్చిన ప్రకటనను ఆ లేఖలో ఖండించారు. ఈటల తన ఆస్తుల పెంపుదల కోసం ప్రయత్నించారని, పేదల భూములను అక్రమంగా ఆక్రమించారు” అని జగన్ ఆరోపించారు.

తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తానని చెప్పిన ఈటల తన ఆస్తుల రక్షణ కోసం బిజెపి గూటికి చేరారంటూ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఈక్రమంలో ఈటల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన ఈటల కేవలం తన ఆస్తుల పెంచుకునేందుకు యత్నించాడన్నారు. ఈటల తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం అని ప్రజలకు తెలియజేస్తున్నామని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు. ఈటల రాజీనామాను తమ పార్టీ ఖండిప్తోందని, ఈ మేరకు కెసిఆర్- ఈటల మధ్య వ్యవహారం తెలంగాణ ప్రజలకు సంబంధించినది కాదని లేఖలో తెలిపారు.

Telangana Maoists Letter to Etela Rajender 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News