Friday, April 26, 2024

వైద్యసేవల్లో మూడో స్థానంలో తెలంగాణ

- Advertisement -
- Advertisement -

Telangana ranks third in medical services

నగరానికి నలువైపులా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం
ప్రజా వైద్యంలో రూ. 1,690 తలసరి ఖర్చు చేస్తూ దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నాం
ఫీవర్ ఆసుపత్రిలో రూ.10.9 కోట్లతో నిర్మించనున్న ఓపీ బ్లాక్‌కు శంకుస్థాపనలో మంత్రి టి.హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : పేదలకు వైద్యం అందించడం లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని స్వయంగా కేంద్ర వై ద్యారోగ్య శాఖ మంత్రే చెప్పారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ప్రజా వైద్యంలో రూ. 1,690 తలసరి ఖర్చు చేస్తూ దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో శనివారం రూ. 10.91 కోట్లతో నిర్మించనున్న నూతన ఓపీ బ్లాక్‌కు మంత్రి శంకుస్థాపక చేశారు.అనంతరం 3 అంబులెన్స్‌లు, 13 హార్సే వెహికల్స్(పరమపద వాహనాలు)లను మంత్రి జెండా ఊపి ప్రారంభించా రు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ,త్వరలో నే హైదరాబాద్ నగరానికి నలువైపులా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభిస్తామని తెలిపారు. గాంధీ,ఉస్మానియా, కోరంటి ఆసుపత్రులపై లోడ్ పెరిగిందని, అందకే సిఎం కెసిఆర్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు కడుతున్నారని చెప్పారు. సమైఖ్య రాష్ట్రంలో కొత్త దవాఖానలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు చనిపోతే పార్ధివదేహాలను ఇళ్లను పంపించడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సిఎస్‌ఆర్ కింద అంబులెన్స్‌లు ఇచ్చిన పలు సంస్థలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా సమయంలో వైద్య సిబ్బంది చాలా కష్టపడ్డారన్నారు. ఫీవర్ ఆసుపత్రికి ఘనమైన చరిత్ర ఉందని, 1915లో క్వారంటైన్ సెంటర్‌గా మొదలై కాలక్రమేణా కొరంటి ఆసుపత్రిగా పేరుగాంచిందని అన్నారు. అంటువ్యాధులు అనగానే ముందుగా ఫీవర్ హాస్పిటల్ గుర్తుకు వస్తుందని చెప్పారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటగా ఈ హాస్పిటల్‌ను సందర్శించారని, హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణం రూ.5 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ ఆసుపత్రిలో ఓపీ రోజుకు సగటున 500 నుంచి- 600 మంది వరకు వస్తున్నారని, సీజనల్ వ్యాధుల సమయంలో 1000 వరకు వస్తున్నారని పే ర్కొన్నారు. అందుకే కొత్త ఒపి బ్లాక్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే ఫీవర్ హాస్పిటల్ మార్చురీ అభివృద్ధికి రూ.60 లక్ష లు, డయాలసిస్ వింగ్ రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే అంబులెన్స్ కోసం 5- నుంచి 10 వేలు ఖర్చయ్యేదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభు త్వం ఉచితంగా పార్థివ వాహనాలను ప్రవేశపెట్టిందని అన్నా రు.

మార్చురీలను అభివృద్ధి చేస్తున్నామని, 61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 32.54 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. ఇండియాలోనే బెస్ట్ మార్చురీలను అధ్యయనం చేసి.. 9 కోట్లతో ఉస్మానియా హాస్పిటల్‌లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.గతంలో ఆరోగ్యశ్రీ కింద ఒక కుటుంబానికి రూ.2 లక్షలు మాత్రమే వచ్చేదని, సిఎం కెసిఆర్ ఆ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారని చెప్పారు. దవాఖానలో మందుల కొరత ఉండొద్దని తెలిపారు.వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని,ఈ మేరకు త్వరలో భర్తీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట ఎంఎల్‌ఎ కాలేరు వెంకటేశ్, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,డిఎంఇ రమేష్ రెడ్డి, ఐపిఎం డైరెక్టర్, ఫీవర్ హాస్పిటల్ ఇంఛార్జి సూపరింటెండెంట్ శంకర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతిమీనా తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News