Friday, April 26, 2024

తెలంగాణలో ఓటర్లు@ 2,99,77,941

- Advertisement -
- Advertisement -

ఇది రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య

2022తో పోల్చితే 3.78లక్షలు తక్కువ

హైదరాబాద్ అత్యధికం.. భద్రాచలంలో
అత్యల్పం ఓటర్ల తుది జాబితా విడుదల

 1,50,48,250 మంది పురుష ఓటర్లు,
1,49,24,718 మంది మహిళా ఓటర్లు,
థర్డ్ జెండర్ ఓటర్లు 1951 మంది
2740 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు
ఓటర్ల తుది జాబితాను విడుదల చేసి ఇసి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 2,99,77,941 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2023 ఓటర్ల జా బితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ముగియడంతో కొత్త ఓటర్ల జా బితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణ లో 1,50, 48,250 మంది పురుష ఓటర్లు, 1,49,24,718 మంది మహిళా ఓటర్లు ఉండగా, 1951 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. వీరి తోపాటు 2740 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉన్నట్లు ఇసి వెల్ల డించింది. సర్వీస్ ఓటర్లు 15,282 ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 2,78,650 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఓటర్ల తుది జాబితా ప్రకారం హై దరాబాద్ జిల్లా ఓటర్ల సంఖ్య 42,15,456కి చేరింది,. రంగారెడ్డి జిల్లాలో 31,08,068 మంది, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 25, 24,951 మంది ఓటర్లు ఉన్నట్లు ఇసి తెలిపింది. 1,42,813 మం ది ఓటర్లతో అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గం గా భద్రాచలం నిలిచింది. ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా తర్వాత జనవరి నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటి స్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గురు వారం రాష్ట్ర ఓటర్ల జాబితాను వి డుదల చేశారు. 2022 జనవరి 5న తుది ఓటర్ల సంఖ్య 3,03, 56,894 ఓటర్లు ఉండగా, 2023 నవంబర్ 9వ తేదీ నాటికి 3,45,648 ఓట్లను కలపడంతో పాటు 11,36, 873 ఓట్లను తొలగించారు. అభ్యంతరాల స్వీకరించి ఈ ఏడాది జనవరి 5వ తేదీ నాటికి 6,84,408 ఓట్లను కలిపి 2,72, 418 తొలగింపుతో మొత్తం 2,99,77,941 ఓట్లతో ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటిచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News