Tuesday, April 30, 2024

రూ.200కోట్ల ఎఫ్‌డిల హాంఫట్

- Advertisement -
- Advertisement -
telugu academy fd scandal in hyderabad
తెలుగు అకాడమీ కుంభకోణంలో కొత్త కోణం
12ఏళ్లలో భారీగా దోచుకున్న సాయికుమార్
నిందితుల కస్టడీ నాలుగు రోజులు పొడిగించాలని సిసిఎస్ విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో సిసిఎస్ పోలీసులకు తవ్వేకొద్ది కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు సాయికుమార్ విచారిస్తున్న క్రమంలో గడచిన 12 ఏళ్లలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన రూ. 200 కోట్ల ఎఫ్‌డిలను కాజేసి నట్లు సిసిఎస్ పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వ శాఖలకు చెందిన ఎఫ్‌డిలను కాజేసిన సాయికుమార్‌పై ఇప్పటికే ఏ డు కేసులను నమోదు చేశామన్నారు. కాగా మొత్తం రూ.200 కోట్లలో సాయి కుమార్ వాటాగా రూ. 80 కోట్లు దండుకున్నట్లు తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో ఎపిలోని తణుకు నివాసి వెంకటరమణ, సత్తుపల్లికి చెందిన వెంకట్‌లతో కలసి సాయి మోసాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, సాయికుమార్‌కు సహకరించిన ఆరుగురు బ్యాంక్ మేనేజర్లను అరెస్ట్ చేశామని సిసిఎస్ పోలీసులు తెలిపారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో సాయి కుమార్ ముఠా ఎపి హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ10 కోటు, ఎపి సీడ్స్ కార్పొరేషన్ నుంచి రూ.5 కోట్లు ఎఫ్‌డిలను డ్రా చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్ చెందిన రెండు సంస్థల 15 కోట్లు డ్రా చేసిన సాయికుమార్ డిపాజిట్లను ఐవొబి బ్యాం క్ నుంచి బదిలీ చేయడంతో పాటు ఐవొబి నుంచి ఎపి మర్కంటైల్ కోప రేటివ్ సొసైటీ నిధులు బదిలీ చేసి విత్ డ్రా చేసుకున్నట్లు తేలింది. ఎపి కి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను కాజేసినట్లుగా సిసిఎస్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలాఉంటే తెలుగు అకాడమీ కేసులో నిందితుల వద్ద నుంచి పూర్తి వివరాలు సేకరించేం దుకు నిందితులను మరో 4 రోజులు కస్టడీకి తీసుకుంటామని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు.

ఇంతకూ ఎవరీ సాయికుమార్

ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సాయికుమార్ ఎవరన్న కోణంలో సిసిఎస్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలో 49 ఏళ్ల చుండూరి వెంక ట కోటి సాయికుమార్ అలియాస్ సాయికుమార్ ంకామ్ పట్టభద్రుడని, ఆర్థిక వ్యవహారాల్లో, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల లెక్కలు, ప్రభుత్వ శాఖల్లో నిధులను బ్యాంకుల్లో ఎఫ్‌డీలు చేయించడంలో దిట్ట అని తేలింది. నగరం లోని అంబర్‌పేట్ డిడి కాలనీలో నివాసముంటున్న సాయికుమార్ ఎంకామ్ తర్వాత ఛార్టెడ్ అకౌంటెంట్ అయ్యేందుకు ఐసిడబ్ల్యూఎ కూడా పూర్తి చేశాడు. దాంతో పెద్దగా ఆదాయం రాదని గ్రహించి బషీర్‌బాగ్‌లో ఓ కంప్యూటర్ సెం టర్ ప్రారంభించాడు. అలాగే ఓ టివి ఛానెల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేశాడు. ఈ క్రమంలోనే పన్నెండేళ్ల క్రితం చెన్నైకి చెందిన కొందరు వ్యక్తులు సాయికుమార్‌ను కలిశారు. ఓ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 6 కోట్లు బదిలీ చే స్తామని, కమీషన్ రూ. కోటి ఇస్తామని వివరించగా సాయికుమార్ సరేనన్నా డు.

సదరు వ్యక్తులు రూ. 6 కోట్లు జమచేయగా రూ.కోటి కమీషన్ తీసుకుని వారికి రూ. 5 కోట్లు ఇచ్చేశాడు. కొద్ది రోజులకే సిబిఐ అధికారులు సాయి కుమార్‌ను అరెస్ట్ చేశారు. నార్తర్న్ కోల్ ఫీలడ్స్ చెన్నైకి చెందిన రూ. 25 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ్యవహారంలో నిందితులకు సహకరించినందుకు అరెస్ట్ చే శామని చెప్పారు. కొద్దినెలలు జైల్లో ఉండి వచ్చిన సాయికుమార్ ఫిక్స్‌డ్ డిపా జిట్ల మోసాలపై దృష్టి కేంద్రీకరించాడు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కార్పొరేషన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ మైనార్టీ కార్పొరేషన్ పిల్లలకు ఉపకార వేతనాల పంపిణీ, ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తుండేది. తొమ్మి దేళ్ల క్రితం మైనార్టీ కార్పొరేషన్ అధికారులను కలిసిన సాయికుమార్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే వడ్డీలు ఎక్కువగా వస్తాయని నమ్మించాడు. తన సహచరుడు నండూరు వెంకటరమణతో కలసి పథకం రచించాడు.

విజయా బ్యాంక్ కోఠీ శాఖలో మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించాడు. ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్లను అప్పటికే ఆ బ్యాంక్‌లో తప్పుడు పేర్లతో తెరిచిన పదిహేను ఖా తాల్లోకి మళ్లించి డబ్బులు తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సా యికుమార్‌ను మరోసారి అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన సాయికుమార్ ఈసారి ఎపి హౌసింగ్‌బోర్డు, కాలుష్య నియంత్రణ మండలిపై కన్నేశాడు. ఆ రెండు సంస్థలతో సంబంధమున్న ప్రభుత్వ అధికారులు, ఐఎ ఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో పరిచయమున్న వ్యక్తిని ఆరేళ్ల క్రితం కలిశాడు. ఆయన అంగీకరించడంతో (ప్రస్తుతం ఎస్‌బిఐ)లో మాజీ అధికారి ని కలుసుకున్నాడు. అనంతరం అధికారులను వేర్వేరుగా కలుసుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయాన్ని వివరించాడు. వారు సరేననడంతో ఎస్‌బిహెచ్ మెహిదీప ట్నం, సింగపూర్ టౌన్‌షిప్, మల్కాజిగిరి, ఖమ్మంలోని మరో బ్యాంక్‌లో ఎఫ్‌డీలను తెరిచి,. కొద్దిరోజులకే వి త్‌డ్రా చేశారు. కాగా ఐదేళ్ల క్రితం సిబిఐ కేసు నమోదు చేసి సాయికుమార్‌ను ముంబయిలో అరెస్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News