Tuesday, May 7, 2024

దేశంలో ప్రమాదకరంగా ఆ పది నగరాలు

- Advertisement -
- Advertisement -

Covid-19

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40 వేల మార్క్‌ను దాటింది. మంగళవారం ఆరోగ్య మ్రంతిత్వశాఖ వెల్లడించిన ప్రకారం తాజా లెక్క 46,433 కేసులు. వీరిలో 32,138 మంది ఇంకా చికిత్స పొందుతుండగా, 12,726మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 1568మంది మరణించారు.

కొవిడ్19 బాధితుల సంఖ్య మహారాష్ట్రలో 15,000 మార్క్‌కు దగ్గరైంది. గుజరాత్ 6000 మార్క్‌కు చేరువైంది. మూడోస్థానంలో ఉన్న ఢిల్లీలో 4898 కేసులు నమోదయ్యాయి. ఇది రాష్ట్రాలవారీగా లెక్క. కానీ, దేశం మొత్తమ్మీద నమోదైన కేసుల్లో దాదాపు 58 శాతం పది నగరాల్లోనే అన్నది గమనార్హం. ఈ పది నగరాల్లో మంగళవారం వరకు కేసుల సంఖ్య 27,000 మార్క్ దాటింది.

ముంబయి : ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబయిలో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఇక్కడ నమోదైన కేసుల సంఖ్య 9310. వీరిలో 1395మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 361మంది మృతి చెందారు. మహారాష్ట్ర మొత్తమ్మీద నమోదైన కేసులు 14,541 కాగా, ఈ ఒక్క నగరంలోనే 60 శాతంపైగా నమోదు కావడంతో జన సమ్మర్దంగా ఉండే ప్రాంతాల్లోనే కరోనా విజృంభిస్తోందని అర్థమవుతోంది.

ఢిల్లీ : దేశ రాజధాని నగరం 5000 మార్క్‌కు దగ్గరైంది. మంగళవారం వరకు ఇక్కడ 4898 కేసులు నమోదయ్యాయి. వీరిలో 1431మంది కోలుకోగా, 64మంది మృతి చెందారు. అహ్మదాబాద్‌ః గుజరాత్‌లోని అతిపెద్ద నగరమైన అహ్మదాబాద్‌లో కొత్తగా 259 కేసులు నమోదు కాగా, మొత్తం సంఖ్య 4076కు చేరింది. రాష్ట్రంలోని మొత్తం(5804) కేసుల్లో ఇది సింహభాగం. ఈ

జిల్లాలో 620మంది డిశ్చార్జ్ కాగా, 200మంది మృతి చెందారు.

పూణె : మహారాష్ట్రలో కేసులు అధికంగా నమోదైన మరో నగరం పూణె. ఇక్కడ ఇప్పటివరకూ 2000కుపైగా కేసులు నమోదు కాగా, 425మంది డిశ్చార్జ్ అయ్యారు. 113మంది మృతి చెందారు.

చెన్నై : చెన్నైలో 1700 కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో మొత్తం కేసులు ౩550 కాగా, 1409మంది

డిశ్చార్జ్ అయ్యారు. 31మంది మరణించారు. చెన్నై పక్కనున్న కోయంబేడ్ మార్కెట్ ఇప్పుడు కరోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. నగరం పక్కనున్న అతిపెద్ద కూరగాయలు, పండ్ల మార్కెట్ ఇది.

ఇండోర్ : మధ్యప్రదేశ్‌లో కొవిడ్19 కాటుకు గురైన నగరం ఇండోర్. మంగళవారం వరకు ఈ జిల్లాలో 1654 కేసులు నమోదు కాగా, 468మంది డిశ్చార్జ్ అయ్యారు. 79మంది మరణించారు. తాజాగా 24 గంటల్లో 43 కేసులు ఈ ఒక్క జిల్లాలోనే నమోదుకావడం గమనార్హం.

థానే : మహారాష్ట్రలోని కరోనా బాధిత నగరాల్లో థానేది మూడో స్థానం. ఇక్కడ మొత్తం 1238 కేసులు నమోదు కాగా, 285 మంది కోలుకోగా, 21మంది మృతి చెందారు. జైపూర్‌ః పింక్ సిటీగా పేరున్న జైపూర్‌లో 1036 కేసులు నమోదు కాగా, 40మంది మృతి చెం దారు. రాజస్థాన్‌లో మొత్తం కరోనా కేసులు ౩౦61 కాగా, ఈ ఒక్క నగరంలోనే మూడోవంతు నమోదయ్యాయి.

సూరత్ : గుజరాత్‌లో మరో కరోనా బాధిత నగరం సూరత్. ఇక్కడ 706 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో మొత్తం కేసులు 5804 కాగా, 1195మంది కోలుకున్నారు. 319మంది మృతి చెందారు.

ఆగ్రా : మంగళవారం ఉదయం ఆగ్రాలో కొత్తగా 9 కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 6౩౦. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం కేసులు 2766 కాగా, 802మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 50కి చేరింది.

Ten Most Covid 19 Dangerous Cities in India

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News