Friday, May 3, 2024

విద్యుత్‌సౌధ ఉద్రిక్తం

- Advertisement -
- Advertisement -

powerhouse

 

ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్ అంటూ నినాదాలు

పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి
చేరడానికి వచ్చిన ఎపి ఉద్యోగుల ప్రతినిధులు ముగ్గురితో మాట్లాడిన సిఎండి ప్రభాకర్ రావు

మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ సౌధలో బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జస్టిస్ ధర్మాధికారి నివేదిక ఆధారంగా పలువురు ఉద్యోగులు రిపోర్టు చేయడానికి విద్యుత్ సౌధకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ, అకౌంట్స్ అధికారుల సంఘం అధ్యక్షుడు అంజయ్య నేతృత్వంలోని సభ్యులు ఆంధ్రా ఉద్యోగులు గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రిపోర్టు చేయకుండా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రిపోర్టు చేసేందుకు వారు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు వెంటనే జస్టిస్ ధర్మాధికారి నివేదిక ఆధారంగా రిపోర్టు చేయడానికి వచ్చిన ఉద్యోగుల నుంచి ముగ్గురు ఉద్యోగుల ప్రతినిధులను మాట్లాడేందుకు తన చాంబర్‌కు రావాలని పిలిపించారు.

దీంతో పోలీసులు రక్షణగా ఉండి ఆ ముగ్గురిని ప్రభాకర్‌రావు వద్దకు తీసుకెళ్తుండగా తెలంగాణ ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పోలీసులున్నా ఆంధ్రావాలా గో బ్యాక్ అంటూ అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులు వారిని వారిస్తూ సిఎండి వద్దకు తీసుకెళ్ళారు. ఆ ముగ్గురితోనూ ప్రభాకర్‌రావు మాట్లాడారు. అనంతరం శివాజీ, అంజయ్యలు మాట్లాడుతూ.. జస్టిస్ ధర్మాధికారి నివేదిక తమ అభిప్రాయాలకు, అభ్యంతరాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రా విద్యుత్ సంస్థలు, ఆంధ్రా స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సౌధకు ఆంధ్రా విద్యుత్ ఉద్యోగులు తరచుగా రావడం కారణంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయని వారు వెల్లడించారు. అయితే, రిలే నిరహార ధీక్ష చేపట్టిన జెఎసి ఉద్యోగులను జెఎసి నేతలను ధీక్ష విరమింపజేశారు. పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్, విద్యుత్ సౌధలోనూ రిలే నిరహార ధీక్ష చేపట్టారు.

Tension at the powerhouse
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News