Tuesday, May 7, 2024

టెన్త్ ఎగ్జామ్స్ వాయిదా

- Advertisement -
- Advertisement -

High Court

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశించింది. కాగా శనివారం నాడు జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని ఆ ఆదేశాలలో స్పష్టంగా సూచించింది. ఈనెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు రీ షెడ్యూల్ చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో అత్యవసర వ్యాజ్యంగా భావించిన ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వణికిస్తున్న తరుణంలో పరీక్షలు కొనసాగించడం సమంజసం కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ కుమార్ వాదనలు వినిపించారు. విద్యార్థులు కూడా ప్రశాంతంగా చదవలేని గందరగోళ పరిస్థితులు ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలని లేదా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని పిటిషన్ దారుడు కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సోమవారం నుంచి ఈనెల 30 వరకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆందోళన వద్ద : స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రారమ్‌చంద్రన్
పదవ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందోళన చెందవద్దని, అనతికాలంలో సమావేశం ఏర్పాటు చేసి పరీక్షల తేదీలను వెల్లడిస్తామని విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రారమ్‌చంద్రన్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయని, రాష్ట్రంలో పరిస్థితుల కారణంగా విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని తదుపరి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

ఒపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
డా.బిఆ ర్‌అంబేద్కర్‌సార్వత్రిక విశ్వవిద్యాలయం( ఒపెన్ యూనివర్శిటీ) ఈనెల 22 నుంచి ఏప్రిల్4వ తేదీ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న అన్ని వార్షిక పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటనలో తెలిపారు. సిబిసిఎస్‌సిస్టమ్‌లో డిగ్రీ ప్రధమ సంవత్సరం మొదటి సెమిస్టర్, బిఇడి (స్పెషల్‌ఎడ్యుకేషన్) మొదటి సెమిస్టర్, సప్లిమెంట్, ఎంబిఏ రెండో సెమిస్టర్, బిఎల్‌ఐఎస్‌సి రెండో సెమిస్టర్‌పరీక్షలను వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

Tenth class Examinations postponed
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News