Sunday, May 12, 2024

అజిత్ ధోవల్ ఇంటిపై ఉగ్రవాదుల రెక్కీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఎ) అజిత్ ధోవల్ లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నారు. ఈ మేరకు ఆయన నివాసం వద్ద రెక్కి నిర్వహించినట్లు పోలీసు కస్టడీలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదాయత్ ఉల్లా మాలిక్ అంగీకరించాడు. ప్రస్తుత పరిణామంతో అజిత్ నివాసం కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ నెల 6వ తేదీన హిదాయత్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటరాగేషన్ దశలో పలు కీలక విషయాలు తెలిపాడు. 2019 మే నెలలో ఢిల్లీలోని సర్దార్ పటేల్ భవన్, ధోవల్ నివాసంతో పాటు ఇతర ప్రముఖుల బసల వద్ద కూడా తాను రెక్కీ జరిపినట్లు, ఇందుకు పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఆదేశాలు వెలువరించినట్లు చెప్పాడు. సాంబా సరిహద్దుల్లోనూ తాను సునిశిత ప్రాంతాలను పరిశీలించినట్లు వివరించారు. కేవలం తాను ఒక్కడినే కాకుండా పలువురు ఇతర ఉగ్రవాదులు ఈ రెక్కీ కార్యకలాపాలలో పాలుపంచుకున్నట్లు ఈ మాలిక్ అనే వ్యక్తి చెప్పినట్లు తెలిసింది.

ఇంటరాగేషన్ వివరాలను కశ్మీర్ పోలీసులు ఢిల్లీ పోలీసులకు తెలిపారు. దీనితో ఢిల్లీ పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కశ్మీర్ భద్రతా వ్యవహారాలలో ధోవల్ అత్యంత కీలక వ్యక్తిగా ఉన్నారు. తరచూ అక్కడ క్షేత్రస్థాయిలో తిరిగారు. ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఆయన పేరు ప్రముఖంగా ఉందని నిఘా వర్గాలు ముందుగానే పసికట్టాయి. 2016 సర్జికల్ స్రెయిక్స్, 2019 లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులకు ధోవల్ వ్యూహకర్తగా ఉన్నారు. తాను ధోవల్ ఆఫీసుకు చెందిన మ్యాప్ ఇతరత్రా వివరాలతో కూడిన మ్యాప్‌ను వీడియోగా తీసినట్లు ఇంటరాగేషన్ దశలో ఉగ్రవాది తెలిపారని జమ్మూ కశ్మీర్ పోలీసులు చెప్పారు. పాకిస్థాన్ నుంచి తనకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తిని డాక్టర్‌గా సంకేత నామంతో పిలుస్తామని వెల్లడించారు. రెక్కీ జరిగినట్లు ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్థానీకి తాను వాట్సాప్ ద్వారా సమాచారం అందించడం జరుగుతోందని ఈ వ్యక్తి అంగీకరించారు.

Terrorists Recced at NSA Ajit Doval’s House

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News