Monday, May 6, 2024

టెట్ పేపర్-2 లోపాలను సవరించారు

- Advertisement -
- Advertisement -

TET Paper-2 errors corrected

నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్.సి.టి.ఇ) నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో సరైన విధి విధానాలు లేకపోవడం వల్ల అనేక విమర్శలకు గురవుతున్నది. టెట్ అర్హత ఉంటేనే డిఎస్సీకి గాని, టిఆర్‌టికిగాని అవకాశం ఉంటుంది. పైగా వెయిటేజ్ ఉండటంతో అభ్యర్థులు పోటీపడి రాస్తున్నారు. అంతేగాక ఇంతకు ముందు ఏడు సంవత్సరాలు కాల పరిమితి వ్యవధిని తీసివేసి జీవితకాలం పెట్టడంతో తీవ్రమైన పోటీ ఉంది. గతంలో పేపరు -1 డి.ఎడ్ అభ్యర్థులు మాత్రమే రాసే అవకాశం ఉండేది. ఇప్పుడు కోర్టు బి.ఎడ్ వాళ్లకు కూడా అవకాశం ఇవ్వడంతో పేపర్ -1 రాసే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు ఆరు లక్షలకు పైగా అప్లై చేశారంటే పోటీ తీవ్రతను గమనించవచ్చు.

పేపరు- 2 లోపాలు: పేపర్- 1కు సంబంధించినవి సరిగానే ఉన్నప్పటికీ అసలు లోపాలన్నీ పేపర్ -2 లో ఉన్నాయి. బి.ఎ తెలుగు, ఎం.ఎ తెలుగు చదివిన వారికి సోషల్‌లో 60 మార్కులు, తెలుగుకు 30 మార్కులు కేటాయించగా, బిఎస్‌సి గణితం చదివిన వారికి సంబంధిత సబ్జెక్టుకు 30 మార్కులు, జనరల్ సైన్స్‌కు 30 మార్కులు కేటాయించారు. అలాగే బిఎస్‌సి సైన్స్ చదివిన వారికి సంబంధిత సబ్జెక్టుకు 30 మార్కులు కాగా గణితంకు 30 మార్కులు కేటాయించారు. ఇవన్నీ అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయా సంబంధిత సబ్జెక్టును మాత్రమే బోధించాలి. అలాంటప్పుడు నాణ్యత లోపించిన విషయం స్పష్టంగా కనబడుతున్నది.సోషల్ సబ్జెక్టు అభ్యర్థులకు తప్ప మిగతా వాళ్ళకు తీవ్రమైన నష్టం కలుగుతున్నది. అందువల్ల జాబ్ మిస్సవుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఈ విషయమై భాషా పండితులు విద్యాశాఖ మంత్రివర్యులకు టెట్ నిర్వహణ కార్యదర్శికి విన్నవించుకున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పరిష్కారం చూపలేదు. ప్రక్క రాష్ట్రంలో పేపర్ -2 సవరించినా మన రాష్ట్రంలో అమలు కావడంలేదని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. మన రాష్ట్రంలోని సంబంధిత అధికారులు మా పరిధిలో లేదని తప్పించు కుంటున్నారు.

సవరణలు: సంబంధిత సబ్జెక్టులకు మార్కులు పెంచి అభ్యర్థులను ఆదుకోవాలి. అనగా తెలుగు వాళ్ళకు తెలుగుకు 90, గణితం వాళ్ళకు గణితంకు 90, సోషల్ వాళ్ళకు సోషల్ లో 90, సైన్స్ వాళ్ళకు సైన్స్‌కు 90 మార్కులు కేటాయించి మిగతా సైకాలజీకి, ఇంగ్లీషు కు యథావిధిగా 30 మార్కులు కేటాయించాలి. అప్పుడే బంగారు తెలంగాణలో నిరుద్యోగుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని విజ్ఞప్తి చేస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News