Saturday, August 9, 2025

టిఎస్‌ఆర్‌టిసి ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగర శివారులోని హకీంపేట్‌లో ఉన్న టిఎస్‌ఆర్‌టిసి ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు ఆ సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎనిమిది, పదో తరగతి విద్యార్హతతో మోటార్ వెహికల్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్‌లలో కోర్సులు అందిస్తున్నట్లు తెలిపింది. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 28లోగా తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఏడాది కాలపరిమితితో మెకానిక్ డీజిల్, వెల్డర్ కోర్సులు, రెండేళ్ల కాలపరిమితితో మోటర్ వెహికల్ మెకానిక్, పెయింట్ కోర్సులు ఆ కళాశాల ద్వారా అందిస్తోంది. ఈ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఏడాదికి రూ.16,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని టిఎస్‌ఆర్‌టిసి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News