Friday, May 3, 2024

పార్లమెంట్‌లో బిసి బిల్లు తక్షణమే పెట్టాలి

- Advertisement -
- Advertisement -

కేంద్రం ఓబిసిలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
త్వరలో ఓబిసి కులగణన నిర్వహించాలి:  రాజ్య సభ సభ్యులు ఆర్.కృష్ణయ్య

మన తెలంగాణ/ హైదరాబాద్: అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘ-మేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు పెట్టారని బిసిలకు చట్ట సభలలో రిజర్వేషన్లు పెట్టాలని పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఈ దేశంలో బిసిలను బిచ్చగాళ్ళను చేశారని రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండ గొర్రెలు – బర్రెలు -పందులు – పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని శాశ్వత బిచ్చగాళ్ళను చేస్తున్నారని మండిపడ్డారు.

రాజ్యాంగ రచన సమయంలోనే విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో రిజర్వేషన్లు పెడితే ఎంతో ప్రగతి జరిగేదిని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కానీ మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచి వేశారని ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మనదేశంలో పీడిత కులాలను ఇంకా అంది వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాజకీయ రంగంలో బిసిల ప్రతినిత్యం 14 శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటివల సేకరించిన గణాంకాల ద్వార బయటపడిందన్నారు.

కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్ర మంత్రి వర్గంలో, లోక్ సభ, రాజ్య సభ, రాష్ట్ర అసెంబ్లీ లు, కౌన్సిల్స్ లో 71 సంవత్సరాల బిసిల ప్రాతినిద్యం సర్వే చేయగా, 14 శాతం దాటలేదంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని డబ్బుల ప్రభావం ఎన్నికల మీద విపరీతంగా వుంది. ఇలాంటి పరిస్తితులలో డబ్బులు లేని బిసిలు ఎన్నికలలో గెలవలేరన్నారు. విదేశీయులైన ఆంగ్లో-ఇండియన్లుకు నామినేటెడ్ ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇస్తున్నారని కాని ఈ దేశంలో పుట్టిన అత్యంత వెనుకబడిన కులాలకు ఇవ్వడం లేదన్నారు. అందుకే అత్యంత వెనుకబడిన కులాలకు ఇంతవరకు అసెంబ్లీకి పార్లమెంటు కడప తొక్కని కులాలకు ఆంగ్లో -ఇండియన్ల మాదిరిగా నామినేటెడ్ ఎమ్మెల్సీ, ఎంపిలు ఇవ్వాలని కోరారు. పంచాయతీరాజ్ సంస్థలో బిసి రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతంకు పెంచాలని ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. గుజ్జు కృష్ణ డాక్టర్ ఎన్ మారేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, వి. హనుమంతరావు, మల్లురవి, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News