Saturday, May 4, 2024

ముగిసిన తొలి దశ బడ్జెట్ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

The first phase budget session that ended

మార్చి14న తిరిగి భేటీ కానున్న లోక్‌సభ

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి భాగం శుక్రవారం ముగిసింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్ సమర్పణతో తొలి భాగం పూర్తయింది. శుక్రవారం రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి సమాధానమిచ్చిన తర్వాత సభ వాయిదా పడింది. లోక్‌సభ ప్రైవేటు సభ్యుల బిల్లులపై చర్చించింది. కాగా బడ్జెట్ ప్రతిపాదనలను సభ్యులు అధ్యయనం చేయడానికి మూడు వారాల పాటు పార్లమెంటుకు విరామం ఇచ్చిన తర్వాత మార్చి 14న లోక్‌సభ తిరిగి సమావేశమవుతుందని తొలి దశ సమావేశాల ముగింపు సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రెండో భాగం సమావేశాల్లో లోక్‌సభ వివిధ శాఖల పద్దులపై చర్చ, ఆర్థిక బిల్లుతో పాటుగా ఇతర బిల్లులపై చర్చిస్తుంది.

ఈ సమావేశాలు ఏప్రిల్ 8న ముగుస్తాయి. కొవిడ్ సమస్యలున్నప్పటికీ సభ్యులు రాత్రి పొద్దుపోయే దాకా కూడా సభలో పాల్గొన్నారని, ఫలితంగా 121 శాతం ఉత్పాదక రేటు సాధ్యమైందని ఈ సందర్భంగా ఓం బిర్లా చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు 12 గంటలు సమయం కేటాయించగా, 15 గంటల 13 నిమిషాలు జరిగిందని, 60 మంది సభ్యులు చర్చలో పాల్గొనగా, మరో 60 మంది లిఖితపూర్వక ప్రసంగాలు అందజేశారని ఆయన చెప్పారు. అలాగే బడ్జెట్‌పై చర్చకు 12 గంటలు కేటాయించగా 15 గంటల 33 నిమిషాలు కొనసాగిందని, 81 మంది చర్చలో పాల్గొన్నారని స్పీకర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News