Saturday, April 27, 2024

పాలిటెక్నిక్ పేపర్ లీక్

- Advertisement -
- Advertisement -

Cancellation of Polytechnic examination held on 8,9 dates

ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షలు రద్దు
15, 16 తేదీల్లో మళ్లీ జరపడానికి నిర్ణయం
హైదరాబాద్ బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ నుంచి ప్రశ్నాపత్రాలు లీక్

మన తెలంగాణ/హైదరాబాద్ : పాలిటెక్నిక్ పరీక్షా పేపర్ల లీకేజ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 8,9 తేదీల్లో జరిగిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే స్వాతి కాలేజీ అబ్జర్వర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. రద్దయిన పరీక్షలను ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. కాగా.. ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేయడంతో ఇతర జిల్లాల్లోని కాలేజీ ప్రిన్సిపాళ్లు వెంటనే పాలిటెక్నిక్ బోర్డుకు సమాచారం ఇచ్చారు. దీంతో బోర్డు సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. కాలేజీ విద్యార్ధులకు ప్రశ్నాపత్రాల లింక్ ఏ విధంగా వెళుతుంది? ఏ కాలేజ్ నుంచి ఈ ప్రశ్న పత్రాల లీక్ వెళ్తుందో వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. హైదరాబాద్ బాటసింగారంలో ఉన్న స్వాతి ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నుంచి ప్రశ్నా పత్రం లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాలేజీ సిబ్బంది కొందరు విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకని ప్రశ్నాపత్రాలను వాట్సాప్ ద్వారా పంపినట్లు గుర్తించారు దీంతో పోలీసులు స్వాతి ఇంజినీరింగ్ కాలేజీపై కేసు నమోదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News