Wednesday, May 15, 2024

దేశానికే ఆదర్శం మన ఊరు – మన బడి

- Advertisement -
- Advertisement -

పెనుబల్లి : మండల పరిధిలోని ముత్తగూడెం గ్రామంలో మన ఊరు, మనబడి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపిగౌతమ్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ఏప్రిల్ లోనే మనకి కావాల్సిన పాఠ్యపుస్తకాలు ఇచ్చి, యూనిఫామ్ కూడా ఇచ్చి, ప్రభుత్వ పాఠశాల ఒక ఉన్నత ప్రమాణాలు నెలకొల్పే విధంగా తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగిందన్నారు.

ఈరోజు నుంచి పాఠశాలకు ప్రతి విద్యార్థిని, విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టాలని చెప్పి కార్యక్రమం తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఉన్నత ప్రమాణం నెలకొల్పాన్నారు. చాలా రోజులు పాటు మన పాఠశాలకు మన కలెక్టర్ గౌతం రావాలని కోరామన్నారు. దేశానికే ఆదర్శం మన ఊరు – మన బడి పునాది నుంచి పై కప్పు వరకు సర్కారు బడి బలోపేతం మన ఊరు, మన బడి, మన బస్తీ, మన బడి ఆశయం అని, అందరికీ మెరుగైన విద్య అందించాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పానికి నిదర్శనం ఈ పథకం అన్నారు.

మూడు దశల్లో రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలతో భవనాలు, పరిశుభ్రత తదితర 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనే ఈ పథక లక్ష్యం అన్నారు. మన ఊరు- మనబడి కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, తహసీల్దార్ రమాదేవి, ఎండిఓ మహాలక్ష్మి, గ్రామ సర్పంచ్ తిరుమల శెట్టి నాగదాసు, మండల టిఆర్‌ఎస్ పార్టీ కనగాల వెంకట్రావు, స్థానిక ఎంపీటీసీ కృష్ణ, జడ్పిటిసి చక్కిలాల మోహన్ రావు , మండలం ఎంపిపి లక్కినేని అలేఖ్య వినీల్ కుమార్, గ్రామ ప్రజలు, టిఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News