Thursday, May 16, 2024

హంతకుడే సంతాపం తెలిపినట్లుంది

- Advertisement -
- Advertisement -

చిదంబరం వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మం త్రి చిదంబరం చేసిన వ్యాఖ్యల పై మంత్రి, బిఆర్‌ఎస్ నేత హరీ శ్ రావు తీవ్రంగా స్పందించా రు. చిదంబరం తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుగా ఉందన్నారు. నాడు తెలంగాణ ప్రకట న చేసిన చిదంబరం దానిని వెన క్కి తీసుకున్న ఫలితంగా కదా ఉ ద్యమంలో యువకులు బలిదా నం జరిగిందన్నారు. పొట్టి శ్రీరాములుప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అ ధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? చరిత్ర తెలియనిది కెసిఆర్‌కు కాదు చిదంబరమే చరిత్ర తెలియకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. అప్పట్లో మ ద్రాసు రాష్ట్రం ఉండేదని,తెలంగాణ రాష్ట్రం లేదని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారన్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయంపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఆర్థి క క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహిస్తే మంచిదన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్‌బిఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబ రం తెలుసుకుంటే మంచిదన్నారు. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారన్నారు. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం కాదు పదకొండుసార్లు అవకాశమిచ్చారని గుర్తు చేశారు. చిదంబరంకు దమ్ముంటే తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ సాధించింది కెసిఆర్ అన్నారు. సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్‌గా నిలిపింది కెసిఆర్ అన్నారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా యావత్ తెలంగాణ ప్రజలు కెసిఆర్ వైపే ఉన్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News