Sunday, April 28, 2024

మేడారం జాతరను కేంద్రం జాతీయ పండగగా గుర్తించాలి

- Advertisement -
- Advertisement -

జాతర నిర్వహణకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది
ఆలయ అభివృద్దికి రూ. 110 కోట్లు కేటాయింపు: మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్:  ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన అదివాసీ గిరిజన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కోరారు. ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు సమ్మక్క సారలక్కల మేడారం మహా జాతర జరగనుందని చెప్పారు. మంగళవారం మేడారం జాతర ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం మేడారం మహా జాతరను వెంటనే జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మేడారం జాతర నిర్వహణ, ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. మేడారం మహా ఘట్టం కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారని వెల్లడించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించామని తెలిపారు. కుటుంబసమేతంగా మేడారం జాతరకు వచ్చే భక్తులు క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని సూచించారు. వనదేవతల దర్శనం కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటికే జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News