Sunday, April 28, 2024

పోలీసులు హెల్త్ చెకప్ చేయించుకోవాలి

- Advertisement -
- Advertisement -

మెదక్: పోలీసులు రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలని ఎస్పి రోహిణి ప్రియదర్శిని అన్నారు. ఆమె ఆదేశానుసారం శుక్రవారం నూతన పోలీస్ కార్యాలయ మైదానంలో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ సిబ్బందికి ఆర్మ్ డ్రిల్, పుట్ డ్రిల్ ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఆర్‌ఐ అచ్యుతరావు, ఆర్‌ఐ నాగేశ్వర్‌రావుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వీక్లి పరేడ్ వల్ల సిబ్బందికి ఫిజికల్ పిట్నెస్‌తోపాటు సమయం దొరికినప్పుడు సిబ్బంది, అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యమని, మంచి శక్తి సామ ర్థాలతో ఎలాంటి ఆనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వ హించడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. పిట్నెస్‌ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవ లంభించాలన్నారు. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలన్నారు. వ్యాయమాన్ని నిత్య జీవితంలోను బాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పి సైదులు, జిల్లా సీఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు, జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News