Friday, May 10, 2024

రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ లేదు

- Advertisement -
- Advertisement -

There is no Covid Second Wave in the Telangana

 

ప్రజలు నెలరోజుల పాటు జాగ్రత్తలు వహించాలి : మంత్రి ఈటల

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ వచ్చిన సందర్భాలు లేవని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం హుజురాబాద్‌లో పర్యటించిన మంత్రి ఈటల రాజేందర్ క్రిస్మస్ సందర్భంగా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది నెలలుగా కరోనా వైరస్‌తో కంటిమీద కునుకు లేకుండా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని, ఇంకో నెల రోజులు చలికాలం ఉంది కాబట్టి ఈ నెల రోజులు మనం మనల్ని కాపాడుకుంటే ఎండాకాలంలో దీని తీవ్రత తగ్గే ఆస్కారం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. బ్రిటన్ నుండి వచ్చిన వారితో కొత్త వైరస్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోందని, భారత ప్రభుత్వం ఆదేశాలతో ఎయిర్‌పోర్టులో వాళ్లందరినీ ట్రేస్ చేసి అందరికీ టెస్టులు చేసి ట్రీట్‌మెంట్ కూడా చేస్తున్నామన్నారు. 1,200 మంది వస్తే 900 మందిని ట్రేస్ చేశామన్నారు.

ఆ 900 మందిలో కూడా ఐదు, ఆరు మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని, వారి శాంపిల్స్ సేకరించి సిసిఎంబికి పంపించడం జరిగిందన్నారు. ఏది ఏమైనా ఈ నెల రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ కూడా జనవరి మాసంలో వచ్చే అవకాశం ఉందన్నారు. రోజుకు పది లక్షల మందికి వేసేలా ప్రిపేర్ అయ్యామన్నారు. భారత ప్రభుత్వం ఎప్పడు అందిస్తే అప్పుడు మొదలుపెడ్తామన్నారు. అంతకుముందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇల్లందకుంట దేవస్థానంలో శ్రీ సీతారామచంద్రస్వామిని మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News