Saturday, May 11, 2024

భగవద్గీత మానవ ప్రవృత్తిలో మార్పుకు దోహదం

- Advertisement -
- Advertisement -

MLC Kavitha participated in Geeta Jayanti festival

 

మన తెలంగాణ/కాచిగూడ: మానవ ప్రవృత్తిలో మార్పుకు దోహదపడేదే భగవద్గీత అని ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు అనా ్నరు. ఈ మేరకు శుక్రవారం శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో గానసభలో గీతా జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని తలరాతలు మార్చే భగ వద్గీత సందేశం, గరికపాటి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు వారు గానసభ ప్రాంగణంలో గోమాత పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ నేను అనే అహంకారాన్ని విడనాడటమే భగవద్గీతలోని విశిష్టత అని, మానవుడు తనని తాను ఉద్దరిం చుకుని సమాజ ప్రయోజనం గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రతి మనిషికి వ్యక్తిగత ప్రవర్తనతో పాటు సంస్కరణ ఎంతో ము ఖ్యమని, భగవద్గీతను అనుసరిస్తే తన తలరాతలు మారుతాయన్నారు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయని, భగవంతుడు ప్రతి శ్లోకంలో మానవ మ నుగడకు, పరివర్తనకు సంబంధించిన సారాంశం అందించారని తెలిపారు.

సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శాసనమండలి సభ్యురాలు కె. కవిత ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు, శారద దంపతులను నూతన పట్టువస్త్రాలతో సత్కరించి స్వర్ణ కంకణం బహుకరించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక మత గ్రంథాలు ఉన్నప్పటికీ ఒక్క భగవద్గీతకే జయంతి ఉత్సవం జరుగుతుందని, అదే భగవద్గీత గొప్పతనమని అన్నారు. గీతా జయంతి ఉత్సవాలు నిరంతరం కొనసాగాలన్నారు. జీవితాన్ని మార్చే గొప్ప గ్రంథం భగవద్గీత అని, భగవద్గీత వల్ల జీవిత సత్యం తెలుస్తుందని, గీతను అధ్యయనం చేస్తే జీవితంలో శోకాన్ని దూరం చేసుకోవచ్చన్నారు. కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు అయాచితం శ్రీధర్, బేవరేజెస్ డెవలప్‌మెట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మెన్ జి దేవీప్రసాద్. కళా శారద, ఎ విజయ్‌కుమార్, ఆర్ నరేష్, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శివపార్వతి శిష్య బృందం ప్రదర్శించిన కృష్ణలీలలు నృత్య రూప కం ఆహూతులను మంత్ర ముగ్దులను చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News