Wednesday, May 1, 2024

బ్రిటన్ నుంచి వచ్చినవారిలో మరి 8 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

Covid to 8 others in UK travel history

 

16 కు చేరుకున్న మొత్తం బాధితుల సంఖ్య
పాజిటివ్ శాంపిల్స్‌ను సిసిఎంబికి పంపిన వైద్యశాఖ
రెండ్రోజుల్లో నివేదికలు వచ్చే అవకాశం
76 మంది క్లోజ్ కాంటాక్ట్‌లను ట్రేస్ చేసిన అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్ : యూకే ట్రావెల్ హిస్టరీ కలిగిన వారిలో కొత్తగా మరో 8 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. ఈనెల 9 నుంచి 23 వరకు బ్రిటన్ నుంచి 1200 మంది తెలంగాణకు చేరుకోగా, వారిలో ఇప్పటి వరకు 926 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీరిలో మొత్తం 16 మందికి కరోనా నిర్ధారణ కాగా, వారందరిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక చికిత్సను అందిస్తున్నట్లు చెప్పారు. అయితే పాజిటివ్ తేలిన వారిలో హైదరాబాద్ జిల్లాలో నలుగురు, మేడ్చల్‌లో 4, జగిత్యాలలో 1, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట్, వరంగల్ అర్బన్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు వీరందరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌ను గుర్తించడానికి సిసిఎంబి(సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ)కి పంపించినట్లు డిహెచ్ వివరించారు. రెండ్రోజుల్లో వాటి ఫలితాలు వచ్చే అవకావం ఉందని ఆయన పేర్కొన్నారు.

76 మంది క్లోజ్ కాంటాక్ట్‌లు ట్రేసింగ్…

పాజిటివ్ సోకిన 16 మందికి అతి సన్నిహితంగా కలసిన 76 క్లోజ్ కాంటాక్ట్‌లను గుర్తించి తమ పర్యవేక్షణలో ఉంచినట్లు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డా జి శ్రీనివాసరావు తెలిపారు. వీరందరిని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచి వ్యాప్తి నివారణకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నామని ఆయన వివరించారు. మరోవైపు యూకే నుంచి వచ్చిన వారందరి ఇళ్లకు నేరుగా వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుందని ఆయన మరోసారి అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాలను మరింత వేగం చేశామన్నారు. అయితే డిసెంబరు 9 తర్వాత రాష్ట్రానికి నేరుగా యూకే నుంచి లేదా యూకే గుండా ప్రయాణించి వచ్చిన వారుంటే స్వచ్చంధంగా 04024651119 నంబర్‌కు లేదా 9154170960కు వాట్సప్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇద్దరి వ్యక్తుల జీనోమ్ సిక్వేన్సీ ఈరోజు తేలే అవకాశం ఉందిః సిసిఎంబి డైరెక్టర్ డా రాకేశ్ మిశ్రా

యూకే నుంచి వచ్చిన వాళ్లల్లో కొత్త రకమా? పాత రకమా అనేది శనివారం రాత్రి వరకు తేలనుందని సిసిఎంబి డైరెక్టర్ డా రాకేశ్ మిశ్రా మన తెలంగాణకు తెలిపారు. శుక్రవారం సిసిఎంబికి తేలిన శాంపిల్స్‌లో వరంగల్ అర్బన్, సిద్ధిపేట్ జిల్లాలకు చెందిన వ్యక్తుల జీనోమ్ సిక్వేన్సీ ఇప్పటికే ప్రారంభమైందని ఈ రోజు రాత్రి వరకు తుది ఫలితాలు వెల్లవడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News