Wednesday, May 1, 2024

స్త్రీ లేకుండా సమాజం లేదు.. స్మిత సబర్వాల్

- Advertisement -
- Advertisement -

SMITHA SABARWAL

 

ఇబ్రహీంపట్నం: స్త్రీ లేకుండా సమాజం లేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. మంగళవారం గురునానక్ ఇంజనీరింగ్ విధ్యాసంస్థల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యాక్రమానికి ఆమేతోపాటు రాచకొండ సిపి మహేష్ భగవత్ ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈసందర్బంగా ఆమే మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అనేక కార్యాక్రమాలు చేపట్టడం జరిగిందని దీంతో స్పూర్తి చెంది ప్రశ్నించె తత్వం అలవర్చుకోవాలని ఆమే అన్నారు.

ర్యాగింగ్ , ఈవ్ టీజ్ చేయడం చట్టరిత్యా నేరమని అన్నారు. మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని ఆమే సూచించారు. మన మద్యనే అనేక మంది మహిళా విధ్యార్థులు ఉన్నారని కష్టపడి గమ్యం చేరే వరకు చదవు కొనసాగించాలని వారికి హితవుపలికారు. చదువు నిరంతర ప్రక్రియ అని ప్రయత్నం చేస్తునే ఉండాలని ఆమే గుర్తు చేశారు. తెలంగాణ పోలీస్ మహిళా బద్రతకు 100 డైయల్ కాల్‌ను ఎంపిక చేశామని గుర్తు చేశారు. ఎలాంటి ప్రమాదంలో ఉన్న వెంటనే 100కు పోన్ చేయాలని తెలిపారు.

కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరమే …
కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమేనని రాచకొండ సిపి మహేష్ భగవత్ పేర్కోన్నారు. మహిళా బద్రత కోసం పోలీష్ శాఖ ఎల్లపుఉ్పడు కృషి చేస్తుందని అన్నారు. 2013లోనే సెక్స్ అరెస్మెంట్ సంస్థ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ముఖ్యంగా ఫొటోస్, వీడియోలు, కామెంట్స్‌, డబుల్ మీనింగ్ వచ్చె పాటలు సెక్సువల్ ఆరాస్మెంట్ క్రిందకు వస్తాయని చెప్పారు. అలా చేసిన వారికి 1 సంవత్సరం జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఈ మద్య గోవా రాష్ట్రంలో మహిళా మంత్రి స్మృతి ఇరాణీ షాపింగ్‌మాల్‌లో సీక్రెట్ కెమారాలు గుర్తించి కేసు నమోదు చేశారని చెప్పారు. 1961లోనే వరకట్నం నిషేద చట్టం అమల్లోనికి వచ్చిందని తెలిపారు. ఈ కార్యాక్రమంలో ఐపిఎస్ ట్రెయిని అధికారీ స్నేహా, ఎసిపి యాదగిరిరెడ్డి, గురునానక్ మేనేజింగ్ వైస్ చైర్మన్ గగన్‌విత్ కోహ్లీ, తదితరులు పాల్గోన్నారు.

 

There is no Society without Women
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News