Saturday, April 27, 2024

ఢిల్లీ ఘర్షణ వేడితో లోక్‌సభ వాయిదా

- Advertisement -
- Advertisement -

హోలీ తరువాత చర్చ : సర్కారు
ఇప్పుడే జరగాలి : ప్రతిపక్షం
సభలో బెంచ్‌లు దాటిన సభ్యులు
 స్పీకర్ ఆగ్రహం, సస్పెన్షన్ హెచ్చరిక

Lok sabha

 

న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల అంశంపై ప్రతిపక్షాలు, అధికారపక్షం దూషణలు, గందరగోళం నడుమ లోక్‌సభ కార్యకలాపాలు వరుసగా రెండోరోజూ వాయిదాపడ్డా యి. ఢిల్లీ ఘర్షణలపై వెంటనే చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. చర్చ జరిగితేనే ఘర్షణల వెనుక ఎవరున్నారు? విద్వేషకర ప్రసంగాల సంగతి ఏమిటీ? అనే అంశాలు తేలుతాయని కాంగ్రెస్, టిఎంసి ఇతర పక్షాలు స్పష్టం చేశాయి. బిజెపి వారిని అధికార బిజెపి సభ్యులు అడ్డుకున్నారు. దీనితో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపిందని, హోలీ తరువాత చర్చ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాలు తెలిపారు. అయితే వెంటనే చర్చ జరగాల్సిందే అని ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకువెళ్లా యి. నినాదాలు చేస్తూ వెళ్లుతున్న వారికి వ్యతిరేకంగా బిజెపి సభ్యులు ఎదురు నినాదాలకు దిగారు. అధికార ప్రతిపక్ష సభ్యులు తమ సీట్లలో నుంచి లేచి పరస్పరం వేరే వారి సీట్ల వైపు దూసుకువెళ్లడం వంటి పరిణామాలు జరిగాయి. దీనితో స్పీకర్ ఆగ్రహించారు. పద్ధతి ప్రకారం లేకపోతే అందరిపైనా చర్యకు దిగుతామని హెచ్చరించారు.

వెల్‌లోకి దూసుకురావడమే కాకుండా, సభ్యులు తమ స్థానాల పరిధిని కూడా అతిక్రమిస్తున్నారని, ఇది సహించేది లేదన్నారు. కాంగ్రెస్ పక్ష నేత అధీరరంజన్ చౌదరీ అధికారపక్ష సభ్యుల స్థానాల వైపు వెళ్లారు. వారి తో ఏదో వాదించారు. దీనితో బిజెపి, కాంగ్రెస్ సభ్యు లు మధ్య పరస్పర ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఎంతకూ అదుపులోకి రాకపోడంతో స్పీకర్ సభను వాయిదా వేసినట్లు ప్రకటించారు. అంతకు ముందు జీరో అవర్‌లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందిస్తూ ప్రభుత్వం జీరో అవర్‌లో చర్చకు సిద్ధం గా ఉందని అన్నారు. అయితే తక్షణ చర్చ అవసరం ఉందని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. కా్ంరగ్రెస్, డిఎంకె ఇతర సభ్యులు ఢిల్లీ ఘర్షణలలో బిజెపి వారి పాత్ర ఉందని తెలుపుతూ నినాదాలకు దిగారు. దీనిని బిజెపి వారు ఖండించారు. బిజెపి సభ్యులు చాలా మంది వందేమాతరం నినాదాలకు దిగారు. అధికార, ప్రతిపక్ష సభ్యు ల వైఖరి సరిగ్గా లేదని, వారు తమ బెంచ్‌లను దాటి రావడం వంటివి సహించేది లేదని, ఇకపై ఇటువంటి చేష్టలకు దిగిన వారిని గుర్తించి వెంటనే సభ నుంచి సస్పెండ్ చేస్తామని స్పీకర్ హెచ్చరించారు. హోలీ పం డుగ తరువాత చర్చ జరుగుతుందని, దీనికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెపుతోందని , మరి దీనిని ప్రతిపక్షాలు ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు.

 

Lok sabha postpone with Delhi violence issue

 

Lok sabha postpone with Delhi violence issue
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News