Thursday, May 9, 2024

పులి మీద పుట్రలా స్వైన్‌ఫ్లూ

- Advertisement -
- Advertisement -

Swine Flu

 

హైదరాబాద్‌లో ఒక కానిస్టేబుల్‌కు స్వైన్‌ఫ్లూ
ఛాతీ ఆసుపత్రి ప్రత్యేక వార్డులో చికిత్స
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఒకరికి కరోనా లక్షణాలు, గాంధీ ఆసుపత్రికి తరలింపు
మంగళవారం నాడు గాంధీ ఆసుపత్రిలో చేరిన మరి ముగ్గురు వైరస్ అనుమానితులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఓ వైపు కరోనా వైరస్ కేసు నమోదుకావడం, మరోవైపు ఓ పోలీసుకు స్త్వ్రన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారిండంతో ప్రభుత్వం అప్రమత్తమై ప్రజలు ముందస్తు చర్యలు పాటించాలని సూచనలు చేసింది. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య సేవల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా పేట్లబురుజులో 9 మంది ఎఆర్ కానిస్టేబుళ్ల అస్వస్థతకు గురికావడంతో వారిని ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారిలో ఒకిరికి స్త్వ్రన్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు.

మిగిలిన 8 మందిని డిశ్చార్జ్ చేసి, స్వైన్ ఫ్లూ సోకిన వ్యక్తిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పూర్తిగా తగ్గిన అనంతరం డిశ్చార్జ్ చేస్తామని ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ మీడియాకు తెలిపారు. స్వైన్ ఫ్లూ త్వరగా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉండటంతో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ఆయన వివరించారు. మరి ముగ్గురు కరోనావైరస్ అనుమానితులను ప్రత్యేక అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ ముగ్గురికీ రక్త పరీక్షలు నిర్వహించాల్సి ఉం దని వైద్యులు తెలిపారు.

 

Swine Flu to Constable in Hyderabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News