Tuesday, April 30, 2024

దృఢమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి!

- Advertisement -
- Advertisement -

6నెలలకు ఒక్క ముఖ్యమంత్రి అయ్యే ప్రభుత్వం మనకు ఎందుకు?
తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : దృఢమైన నాయకత్వం స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, 6నెలలకు ఒక్క ముఖ్యమంత్రి అయ్యే ప్రభుత్వం మనకు ఎందుకు? అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. నాగోల్ లోని దేవకి కన్వెన్షన్‌లో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిధిగా కెటిఆర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి ఎల్.రమణ, పవర్ లూం కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, చేనేత కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసుకున్నామన్నారు. రాష్ట్రం వచ్చాక మౌలిక వసతులు బాగుపడ్డాయని తెలిపారు. కరెంట్ సమస్యలు ఎలా ఉండెనో మీకు తెలుసు. ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసునన్నారు. ఇప్పుడు కడుపు నిండా కరెంట్ ఇచుకున్నాం, సాగు,త్రాగు నీరు సమస్యలు తీర్చుకున్నామని తెలిపారు. వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నామని, దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఇవాళ ఎదిగినమన్నారు. ‘మునుగోడులో గోడు తీర్చినం. ప్లోరోసిస్‌తో మునుగోడులో ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. అలాంటిది ఇవాళ ప్లోరోసిస్‌ను రూపుమాపేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం రూపకల్పన చేసి ఇవాళ పూర్తిగా సమసి పోయింద’ని వెల్లడించారు. జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ ,జిల్లాకు ఒక్క నర్సింగ్ కాలేజి పెట్టినమని తద్వారా ఎక్కడి వాళ్లకు అక్కడే వైద్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి పేద బిడ్డలకు ఉచితంగా చదువును అందిస్తున్నామని, ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయల ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. 10 ఏండ్ల కింద మన ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండే గుర్తుకు తెచ్చుకోండి. 10 ఏండ్ల కింద 10 గంటలు కరెంట్ పోయిన ఆడిగేవాడు లేడు. ఇప్పుడు 10 నిమిషాలు కరెంట్ పోతే ఇదేందీ పరిస్థితి’ అని అంటున్నారు. గత ప్రభుత్వాలు చేసినవి గుర్తుకు తెచ్చుకోవాలని తెలిపారు.

గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మేము చేసింది 6 సంవత్సరాల కాలం మాత్రమే. ఆరున్నర యేండ్లు పని చేసిన మా మీద 65 యేండ్లు పాలించిన వారు వచ్చి అడుగుతున్నారు. వాళ్ళు చేస్తే మేము ఇన్ని ఇబ్బందులు పడుదుమా ఈ ప్రభుత్వం వచ్చాక ఏ రంగం బాగు పడలేదు. ఏ కులాన్ని మంచిగా చూసుకోవడం లేదా. అన్ని వర్గాలను,అన్ని రంగాలను అన్ని విధాలా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మాదే. మన ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమే’నన్నారు. కొత్త సీసాలో పాత సారానే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.

‘2009 లో 9 గంటల కరెంట్, ఆరు కిలోల బియ్యం ఇస్తాం అన్నారు. ఆనాడు ఇవ్వే ఇస్తే ఎలా? అని వైస్సార్‌ను అడిగితే ఆర్ధిక పరిస్థితి బాగా లేదు అన్నాడు. కానీ ఇవాళ 2023లో అది ఇస్తాం ఇది ఇస్తాం అంటున్నార’ని దుయ్యబట్టారు. సంపద పెంచింది సిఎం కెసిఆర్ అని, మంచిగ చేసిన కెసిఆర్ ఉండగా మీకు ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతున్నానన్నారు. ‘మళ్ళీ ప్రభుత్వం మనదే వస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పుడు 3 వేలు ఉన్న చేనేత మిత్రను రూ. 5 వేలు చెస్తాం నేను హామీ ఇస్తున్న’ అని అన్నారు. సంపద పెంచాలి పేదలకు పంచాలి అనేది మా నినాదమని స్పష్టం చేశారు.

‘ఢిల్లీలో నుండి సీల్డ్ కవర్‌లో వచ్చే ముఖ్యమంత్రులు మనకు ఎందుకు? చేనేత రుణమాఫీ చేసుకుందాం? ఇది చేతల ప్రభుత్వం. చేనేతల ప్రభుత్వం. ఎవరి చేతులో రాష్ట్రాన్ని పెట్టాలో ఆలోచన చేయాలి. ఎవరి చేతిలో పెడితే బాగుంటుందో ఆలోచన చేయాలి. ఓట్లు వస్తాయి. గెలుపు ఓటములు ఎవరి స్వంతం కాదు. అవుతల 11 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇవతల ఒక్క కెసిఆర్ ఉన్నాడు. ఒక్క నల్గొండ జిల్లాలో నలుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక్కాయన  ఆ పార్టీలో ముహూర్తం కూడా పెట్టాడు. పిల్లే లేదు కానీ పెళ్లి ముహూర్తం పెట్టాడు ఆయన. గునిగినా అలిగినా మన ఇంట్లోవారితోనే పని చేయించుకోవాలి. గునుగుడు గునుగుడే గుద్దుడు గుద్దుడే. ఢిల్లీ చేతికి ఇస్తే మనం బ్రతుకుతమా? తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎం చేశాడు? అనేది ఆలోచన చేయాలి. ఆనాడు భూముల రేట్లు ఎట్లా ఉండే ఇప్పుడు భూముల రేట్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని టెక్స్‌టైల్ పార్క్ లు పెట్టుకుందాం. నేతన్నల బాగు కోసం ఇంకా ఏమైనా చేయలి అనే ఆలోచన చేస్తున్నామ’న్నారు.

మోడీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు : ఎంఎల్‌సి ఎల్.రమణ
‘1994 నేను ఎంఎల్‌ఎ అయినప్పుడు చేనేత కార్మికుల బాధలు అంత ఇంత కాదని, ఇవాళ రాష్ట్రంలో మనం 75 సంవత్సరాలలో సాదించని ప్రగతి ఇప్పుడు సాధించా’మని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి ఎల్.రమణ అన్నారు. గత కేంద్ర ప్రభుత్వాలు మనకు ఎంతో కొంత నిధులు ఇచ్చి మనకు ఆర్ధిక భరోసా ఇచ్చేది కానీ, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. హ్యాండ్లూమ్ అడ్వైసర్ బోర్డ్‌ను రద్దు చేసింది, అనేక చేనేత కార్మికుల పథకాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని దుయ్యబట్టారు. కానీ సిఎం కెసిఆర్ పద్మశాలిల ఇంట్లో ఉండి చదువుకున్నా డని, మన సమస్యలు తెలుసునని, అందుకే తెలంగాణ ఉద్యమంలోనే మన భాదలపై,మన సమస్యలపై ఆలోచన చేశారన్నారు. ‘ఈ భారత దేశంలో బిసిలకు రుణాలు నేరుగా ఇచ్చిన పథకం లేదని, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ కూడా మన కోసం ఆలోచన చేస్తున్నారు. వందకు వంద శాతం మా పద్మశాలి కులం బీఆర్‌ఏస్ పార్టీ వైపు ఉంద’న్నారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు లేవు. తెలంగాణ లో కర్ఫ్యూ లేదు కరువు లేదు దానికి కారణం సిఎం కెసిఆర్ పాలన. మీ సంపూర్ణ సహాయకలతో రానున్నది మన బీఆర్‌ఎస్ ప్రభుత్వం. మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేది మన కెసిఆర్. చేనేత రంగంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. నాడు వర్కర్స్‌గా ఉన్నవారు నేడు ఓనర్ అయ్యాం అంటున్నారు నాకు ఎంతో సంతోషం అనిపించింది ఇదంతా సిఎం కెసిఆర్ పాలనకు నిదర్శనం. మీరంతా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల’ని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News