Wednesday, May 8, 2024

ఈ విజయం నా ఒక్కడిది కాదు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: ఈ విజయం నా ఒక్కడిది కాదని ఢిల్లీ ప్రజలదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడో సారి ప్రమాణం చేసిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ విజయంలో ఢిల్లీలో ఉన్న ప్రతి కుటుంబంలోని సభ్యుడి హస్తం ఉందని కొనియాడారు. గత ఐదు సంవత్సరాల నా పాలనలో ప్రతి ఒక్కరికి సంతోషంతో పాటు ఉపశమనం కల్పించానని తెలిపారు. ఎన్నికలు  అనేవి  అసలు విషయ కాదని, ఎవరికి ఓటు వేసిన ఢిల్లీ ప్రజలు అందరు నా వాళ్లే అని, పార్టీ, ప్రాంతం, కులం, మతం తేడా లేకుండా అందరి కోసం పని చేస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. క్రేజీవాల్ అన్ని ఉచితంగా ప్రజలకు ఇస్తున్నారని కొందరు అనుకుంటున్నారని, ప్రకృతి నుంచి మనం ఎన్నో ఉచితంగా తీసుకుంటున్నామని, అలాగే అమ్మ ప్రేమ, తండ్రి దీవెనలు, కేజ్రీవాల్ ప్రజలను ప్రేమిస్తారు… అందకే ప్రజలకు అన్ని ఉచితంగా లభిస్తున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.  ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ 62 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయగా బిజెపి ఎనిమిది స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చుంది.

 

Arvind Kejriwal: Some people say Kejriwal is giving everything for free. Nature has ensured every valuable thing in the world is free, be it Mother’s love, father’s blessings or Shravan Kumar’s dedication. So, Kejriwal loves his people and hence this love is free.

 

This is the victory of every Delhiite: CM Aravind

 

Delhi Chief Minister Arvind Kejriwal: This is not my win, this is the victory of every Delhiite, of every family. In the last 5 years, our only effort has been to bring happiness and relief to every Delhiite.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News