Saturday, April 27, 2024

క్రీడలోనూ.. చేతివాటం

- Advertisement -
- Advertisement -

GHMC-Sports

 బల్దియా స్పోర్ట్ విభాగం అవినీతిమయం..!
అందుబాటులో ఉన్న క్రీడలకు ఆన్‌లైన్‌లో దక్కని చోటు
ప్రభుత్వ లక్షాన్ని నీరుగారుస్తున్న అధికారులు!
పర్యవేక్షణలోపం.. అక్రమార్కులకు వరం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి మందికి పైగా జనాభా ఉన్నా, క్రీడలను ప్రోత్సహించడంలో అధికారులు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాల్సిన జిహెచ్‌ఎంసి స్పోర్ట్ విభాగంలో అడుగడుగునా అవినీతిలో కూరుకుపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా సామాగ్రి కొనుగోలు, పంపిణీ మొదలు, ఆన్‌లైన్‌లో మైదానాల నమోదు, స్లాట్ బుకింగ్ వరకు అంతా వ్యాపారమయంగా మార్చివేశారు. క్రీడాకారులను తయారు చేయాల్సిన మైదానాల అధికారులు తమ వ్యాపార కేంద్రాలుగా మల్చుకుంటూరనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు, సిబ్బంది మిలాకత్ అవ్వడంతో చర్యలు తీసుకునేవారే లేకకుండ పోయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గ్రేటర్‌లో 521 క్రీడా మైదానాలు

జిహెచ్‌ఎంసి పరిధిలోని ఎల్‌బినగర్ జోన్‌లో (69), ఖైరతాబాద్ జోన్‌లో (144), చార్మినార్ జోన్‌లో (101), శేరిలింగంపల్లి జోన్‌లో (56), కూకట్‌పల్లి జోన్‌లో (61), సికింద్రాబాద్ జోన్‌లో 90 ఇలా నగర వ్యాప్తంగా మొత్తం 521 క్రీడా మైదానాలు ఉన్నాయి. ఎల్‌బినగర్ 10, ఖైరతాబాద్ 20, చార్మినార్ 31, శేరిలింగంపల్లి , కూకట్‌పల్లి జోన్లలో 19, సికింద్రాబాద్ 17, మొత్తం 90 క్రీడా మైదానాలు కాగా వీటిల్లో 30 రకాల క్రీడాలకు సంబంధించి జిహెచ్‌ఎంసి శిక్షణ ఇస్తోంది. అయితే ఈ మైదానాల్లో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు గాను సరిపడా కోచ్‌లు మాత్రం లేరు. జిహెచ్‌ఎంసి నుంచి క్రీడా ఇన్‌స్పెక్టర్లు, పిసిసిల పేరుతో ఇంఛార్జీలు ఉన్నారు తప్ప పర్మినెంట్ కోచ్‌లను మాత్రం నియమించ లేదు. కేవలం 83 మంది మాత్రమే పార్ట్ టైం కోచ్‌లు ఈ 97 క్రీడా మైదానాల్లో 30 రకాల క్రీడాలకు సంబంధించి సుమారు 222 అంశాలకు క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ పొందాలనుకునే క్రీడాభిమానులు తమకు ఆసక్తిగల క్రీడను బల్దియా స్పోర్ట్ విభాగంలో వెబ్ సైట్ లో ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ నమోదులో కూడా చేతివాటం

క్రీడా ఎంపికకు సంబంధించిన ఆన్‌లైన్ నమోదులో సైతం కొంతమంది అధికారులు, పార్ట్‌టైం కోచ్‌లు, సిబ్బంది కలిసి అక్రమ దందాకు తెర లేపరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబర్‌పేట ప్లేగ్రౌండ్లో షటిల్, బ్యాడ్మీంటన్ క్రీడలు కోచింగ్‌కు అవకాశం ఉన్నప్పటికీ వీటిని ఎంచుకునేందుకు ఆన్‌లైన్‌లో మాత్రం ఈ పేర్లు కనిపించకపోవడం గమనార్హం. అదేవిధంగా రెడ్‌హిల్స్‌లో జిమ్, అంబర్‌పేట మైదానంలో జిమ్‌తో పాటు టెన్నిస్ ఉన్నా ఆన్‌లైన్ జాబితాలో మాత్రం లేవు. అంతేకాకుండా రెడ్ హిల్స్ మైదానంలో ఓ ప్రైయివేట్ కోచ్ మాత్రం జిమ్‌తో పాటు బాడీ మసాజ్ నిర్వహిస్తున్నరనే అరోపణలు ఉన్నాయి. క్రికెట్ క్రీడకు సంబంధించి నగరంలో ఉన్నా క్రేజీ తెలిసిందే.. ఈ శిక్షణ పొందేందుకు ఈ క్రీడాభిమానులు లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే క్రికెట్ సంబంధించి మల్కాజ్‌గిరిలోని గాంధీ విగ్రహం మైదానంతో పాటు మంజుమియా తబేలా ప్లేగ్రౌండ్‌లో శిక్షణ ఉన్నా, వీటిని కూడా ఆన్‌లైన్‌లో పొందపర్చకుండా అక్రమంగా క్రీడాకారులను చేర్చుకుని శిక్షణ ఇస్తూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫీజు తగ్గింపుకు జిహెచ్‌ఎంసి చర్యలు

క్రేజీ ఉన్న క్రీడలను ఆన్‌లైన్‌లో పొందపర్చకపోవడం, పెద్దగా ఆదరణ లేని క్రీడల శిక్షణకు క్రీడాభిమానులు ఆసక్తి చూపడం లేదు. దీంతో క్రీడాకారులను తీర్చిదిద్దాలన్నా ప్రభుత్వ అసలు లక్షం నీరుగారుతోంది. అయితే స్పోర్ట్ విభాగంలో నెలకొన్న పరిస్థితులపై ఉన్నతాధికారుల పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడం కూడా అక్రమార్కులకు వరంగా మారుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొంత మంది స్పోర్ట్ అధికారులు, సిబ్బంది కలిసి క్రీడాకారులు చేరడం లేదని తప్పుడు సమాచారంతో ఉన్నతాధికారులతో పాటు పాలక మండలిని బురిడి కొట్టించే ప్రయత్నం చేయడంతో పాటు ప్రస్తుతమున్న ఫీజులను కొంతమేర సవరించాలనే నిర్ణయించినట్లు సమాచారం.

Corruption in the GHMC Sports Department

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News