Friday, April 26, 2024

మైక్రో కంటైన్మెంట్లు

- Advertisement -
- Advertisement -

నైట్ కర్ఫూలు, పరిమిత లాక్‌డౌన్‌లు

11 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్
సెకండ్ వేవ్ పెద్ద సవాలే, పరీక్షలు, వ్యాక్సిన్లతో తిప్పికొడదాం
 ట్రిపుల్ టితో పాజిటివ్ రేటును 5శాతానికి తగ్గించవచ్చు
రోజుకు 40లక్షల టీకాలు వేసే సామర్థం ఉంది
ఒక్క రోజులో లక్షకు మించి కేసులు ఆందోళనకరం
సిఎంలతో విడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పునర్విజృంభణ కట్టడిపై రాష్ట్రాలూ కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసికట్టుగా స్పందించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న తరుణంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యుటిల పాలనా నిర్వాహకులతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నైట్ కర్ఫూలు లేదా కొవిడ్ కర్ఫూలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రులకు సూచించారు. కంటైన్మెంట్ జోన్లతో కరోనా వైరస్ లక్షణాలున్న వారు ఇతరులతో కలిసేందుకు వీలుండదు. వైరస్ శీఘ్రతర వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇదే విధంగా ఇప్పుడు జరుగుతున్న వివిధ స్థాయి ల విస్తృత స్థాయి టెస్టింగ్‌లు ( వైద్య పరీక్షలు) ట్రేసింగ్ ( కరోనా వచ్చిన వారి గుర్తింపు) ట్రీట్‌మెంట్ ( సముచిత చికిత్స) అంటే త్రిబుల్ టిలపై మరింతగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. పలు రాష్ట్రాలలో కరోనాతో నైట్ కర్ఫూ, కొన్ని చోట్ల పరిమిత లేదా పూర్తిస్థాయి లాక్‌డౌన్ వంటి చర్యలు తీసుకున్న దశలో దేశవ్యాప్త పరిస్థితిని సమీక్షించుకునేందుకు ప్రధాని మోడీ చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్ ప్రాధాన్యతను సంతరించుకుంది. రోజువారి కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే లక్ష పాతిక వేలు దాటడంతో పరిస్థితిపై ప్రధాని సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కంటైన్మెంట్ జోన్లపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు కీలకం అన్నారు. ప్రముఖులు సూచిస్తున్నట్లు దేశంలో మినీలాక్‌డౌన్‌ల దిశలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో వారాంతపు లాక్‌డౌన్‌లు , నైట్ కర్ఫూలు విధించిన అంశాన్ని ప్రధాని పరోక్షంగా ప్రస్తావించారు. శుక్రవారం రాత్రి సిఎంలతో ప్రధాని సమీక్ష అంశంపై దేశవ్యాప్తంగా ప్రజలలో ఆసక్తి నెలకొంది. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకొంటోందని, ప్రత్యేకించి వైరస్ నిరోధక వ్యాక్సిన్ పంపిణీని ఉద్యమ ఉధృతితో సాగిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 11 నుంచి 14 వరకూ దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ చేపడుతున్నట్లు ప్రధాని వివరించారు. నైట్ కర్ఫూ విధానం సముచితమే అని ప్రధాని సమర్థించారు. దీనిని ప్రపంచం ఆచరిస్తోందన్నారు.

దీనితో రోజువారి కార్యక్రమాలకు, విధులకు ఇబ్బంది ఉండదన్నారు. ఇప్పటికే పలు దేశాలు కరోనా కర్ఫూతో ఉన్నాయని అన్నారు. పని విధానాలను ఈ కట్టడి పెద్దగా ప్రభావితం చేయదని అన్నారు. దేశంలో ఆర్‌టి పిసిఆర్ టెస్టులను 70 శాతం వరకూ చేపట్టాలని లక్షం ఖరారు చేసుకున్నట్లు వివరించారు. దీనితోనే వైరస్ గుర్తింపు దీనిని ఎదుర్కొవడం తేలిక కాకపోయినా కష్టమేమీ కాదన్నారు. అత్యంత క్రియాశీలక, చురుకైన టెస్టుల ప్రక్రియ అత్యవసరం అన్నారు. ఇప్పుడు పలు కేసులు లక్షణాలు లేకుండా తలెత్తుతున్నాయి. ప్రజలు ముందుగా వైరస్‌ను గుర్తించలేక పోతున్నారు. చాలా మంది తమకు ఏదో స్వల్ప స్థాయి ఊపిరితిత్తుల సమస్య తలెత్తిందని అనుకుంటున్నారు. అయితే అప్పటికే వారిలో కరోనా వైరస్ ఉండటంతో వారి వల్ల కుటుంబానికి వైరస్ సోకుతోందని ప్రధాని మోడీ తెలిపారు. ట్రిబుల్ టిని ముమ్మరం చేయడంతోనే వైరస్ పాజిటివ్ రేటును 5 శాతానికి తక్కువకు చేర్చవచ్చునని తెలిపారు. రోజుకు 40 లక్షల టీకాలు వేసే శక్తి ఉందని తెలిపిన ప్రధాని ఒక్కరోజే లక్షకు పైగా కేసులు రావడం ఆందోళనకరమే అన్నారు.
సెకండ్ వేవ్ పెను సవాలే
దేశంలోని వివిధ ప్రాంతాలలో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉందని ప్రధాని అంగీకరించారు. దీనితో తిరిగి మనం మరోసారి కఠిన సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. ఎటువంటి పద్థతులు ఆచరించాలనేది వెతుక్కునే దశకు చేరుకుంటున్నామని ప్రధాని చెప్పారు. వచ్చే మూడు వారాలు దేశానికి చాలా కీలకమైన సమయం అన్నారు. కొవిడ్ టీకాలపై ప్రజలలో విస్తృత్త అవగావహన కల్పించాలని సూచించారు. భారీగా పాజిటివ్ కేసులు వస్తున్నాయని అన్నారు. ఇది ప్రమాదకర పరిణామమమే అన్నారు. శాంపుల్స్ సేకరణ కీలకం, మనకు ఏ దేశంలో లేని విధంగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. పరీక్షల సామర్థత ఉంది. దీనిని సరైన విధంగా వినియోగించుకుంటే సెకండ్ వేవ్‌ను తిప్పికొట్టోచ్చునని ప్రధాని పిలుపు నిచ్చారు.
ఎక్కువ మందికి టీకా, 11 నుంచి 14 వరకూ టీకోత్సవ్
సాధ్యమైనంత ఎక్కువ మందికి కరోనా టీకాలు వేయాల్సి ఉందని, దీని కోసం దేశవ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 14 వరకూ టీకా ఉత్సవ్ నిర్వహించాలని సంకల్పించినట్లు, ఈ దిశలో రాష్ట్రాలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాయని భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. 45 ఏండ్లు నిండిన వారంతా టీకాలు పొందాల్సిందే అన్నారు. ఇందుకు ప్రభుత్వాల నుంచి పూర్తిస్థాయి చర్యలు అవసరం అన్నారు.

Tika Utsav from April 11 to 14 across India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News