Monday, August 11, 2025

టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్.. ఆ విషయంలో స్కైని దాటేశాడు..

- Advertisement -
- Advertisement -

డార్విన్: ఈ మధ్యకాలంలో టి-20 ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు.. ఆసీస్ ఆటగాడు టిమ్ డేవిడ్ (Tim David). డేవిడ్ బ్యాటింగ్‌కి వచ్చాడంటే.. మైదానంలో బౌండరీల వర్షం కురవాల్సిందే. అంతలా తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య టి-20 సిరీస్ జరుగుతోంది. అయితే తొలి టి-20 మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ తనదైన శైలీ ఇన్నింగ్స్‌తో జట్టును గట్టెక్కించాడు. జట్టు కష్ట సమయంలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కి వచ్చి గౌరవప్రదమైన స్కోర్‌ని జట్టుకు అందించాడు.

52 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సుల సహాయంతో 83 పరుగులు చేసి.. అందరితో శభాష్ అనిపించుకున్నాడు టిమ్ డేవిడ్ (Tim David). ఈ క్రమంలో ఓ రికార్డు సాధించి.. భారత టి-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను దాటేశాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో కనీసం 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అత్యధిక స్ట్రైక్‌రేట్(51 ఇన్నింగ్స్‌లో 167.37 స్టైక్‌రేట్‌తో 1416 పరుగులు) కలిగిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకు ముందు ఈ రికార్డు స్కై పేరిట ఉండేది. అతడు టి-20 కెరీర్‌లో 167.07 స్ట్రైక్‌రేట్ సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఫిల్ సాల్ట్ (164.32), ఆండ్రీ రస్సెల్ (163.69), ఫిన్ ఆలెన్ (163.27), ట్రావిస్ హెడ్ (159.15) ఉన్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టిమ్ డేవిడ్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 178 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే ఈ లక్ష్యాన్ని చేధించడంలో మాత్రం సౌతాఫ్రికా విఫలమైంది. రికల్టన్ (71), స్టబ్స్ (37) మినహా మిగితా వారందరూ స్వల్ప స్కోర్‌కే పరిమితం కావడంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. తద్వారా ఈ మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News