Wednesday, May 1, 2024

రాజ్యసభకు తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపి రాజీనామా

- Advertisement -
- Advertisement -

TMC MP Dinesh Trivedi resigns from Rajya Sabha

న్యూఢిల్లీ: బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టిఎంసి ఎంపి దినేశ్ త్రివేది రాజ్యసభకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు. బెంగాల్ లో హింస పెరిగిందని దినేశ్ త్రివేది అన్నారు. యుపిఎ హయంలో దినేశ్ త్రివేది రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు. ఎగువసభను ఉద్దేశించి త్రివేది తనను రాజ్యసభకు పంపినందుకు తన పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అయితే పశ్చిమ బెంగాల్‌లో హింసను ఆపడానికి తాను ఏమీ చేయలేకపోతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పశ్చిమ బెంగాల్ ప్రజల కోసం పని చేస్తూనే ఉంటానని త్రివేది స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించినందుకు త్రివేది ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఇదిలావుండగా, భారతీయ జనతా పార్టీ నాయకుడు కైలాష్ విజయవర్గియా మాట్లాడుతూ.. త్రివేదితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన టిఎంసి నుంచి తప్పుకోవడం మంచిదని అన్నారు. త్రివేదిపై ప్రశంసలు కురిపించిన విజయవర్గియా, తమ పార్టీలో చేరాలనుకుంటే బిజెపి తనను పార్టీలోకి సంతోషంగా స్వాగతిస్తుందని అన్నారు. త్రివేది తాను టిఎంసిలో ఉంటాటా లేదా అనే దానిపై ఏమీ చెప్పనప్పటికీ, ఆయన త్వరలో బిజెపిలో చేరుతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News