Sunday, May 5, 2024

తమిళనాడులో ఆగస్టు 31వరకు లాక్‌డౌన్ పొడిగింపు..

- Advertisement -
- Advertisement -

TN Govt Extends Lockdown till Aug 31

చెన్నై:తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అయితే కొన్ని సడలింపులు కల్పించడంతోపాటు కొన్ని ఆంక్షలను కూడా విధించింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే చోట, రెస్టారెంట్టు, హోటళ్లలో డైనింగ్ సర్వీసులకు వెసులుబాటు కల్పించింది. ఆగస్టు వరకు ఆదివారాల్లో పూర్తిగా లాక్‌డౌన్ అమలులో ఉంటుందని, ఆగస్టు 2,9,16,23,30 తేదీల్లో లాక్‌డౌన్ పూర్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకకాల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరిస్తూ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. మతపరమైన సమావేశాలు, మెట్రోరైలు రవాణాతోసహా ప్రజారవాణాపైన, షాపింగ్ మాల్స్, అంతర్రాష్ట ప్రజా, ప్రైవేట్ రవాణా పైన యధావిధిగా ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. స్కూళ్లు, విద్యాసంస్థలు మూసివేసే ఉంటాయని ఆన్‌లైన్ విద్యాబోధన ప్రోత్సహిస్తామని చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించడానికి వైద్యనిపుణుల ప్యానెల్‌ను నియమించారు.

TN Govt Extends Lockdown till Aug 31

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News