Sunday, May 12, 2024

ఆదివారం రాశి ఫలాలు(01-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం:- అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించు కొంటారు. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృతి-ఉద్యోగాలలో ఎదురైనా చికాకులు తొలగి ఊరట చెందే వార్తలు వింటారు.

వృషభం :- పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు  పెంపొందుతాయి. సంతాన పరంగా తీసుకోవాల్సిన జాగర్తలు చర్చకి వస్తాయి.

మిథునం :- కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయాలని సంకల్పానికి వస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు.  వాహన యోగం గోచరిస్తున్నది.

కర్కాటకం :- శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనం అమితంగా ఖర్చు అవుతుంది.

సింహం :- పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోనిఅవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృత్తి-వ్యాపారాలలో లభాల బాట పడతాయి.

కన్య :- కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు నాంది పలుకుతారు. ఆర్థిక వరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. విద్యార్దులు భవిష్యత్తు కొరకు నూతన ఆలోచనలు చేస్తారు.

తుల:- కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. కాంట్రాక్టు దక్కించుకొనుటకు ప్రణాళికలు రచిస్తారు.  క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం :- పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు, విస్తరిస్తారు. విలువైన వన్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు :-  ఇంటా బయటా ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలలో ఆశించినంత లాభాలు దక్కవు.

మకరం :- ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వన్తు, వస్త్రాలు కొనుగోలు. మితిమీరిన  ఆలోచనలని అదుపు చేసుకోవడం ఉత్తమమం.

కుంభం:- ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. సోదరులను కలిసి ఆనందంగా గడపుతారు.

మీనం:- రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. భూములు క్రయ విక్రయాల విషయాలు సేకరిస్తారు.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News