Thursday, May 16, 2024

ఆదివారం రాశి ఫలాలు(24-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా   సాగుతాయి. సొంత బాకీలు వసూలు అవుతాయి.విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొంత ఒడిదుడుకులు ఎదురైనా నిలబడతారు.

వృషభం: ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు.స్వల్ప లాభాలు ఉంటాయి.

మిథునం: ఆరోగ్యపరంగా మెలకువ చాలా అవసరం. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కొత్త పనులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. కొన్ని విషయాలలో అప్రమత్తత చాలా అవసరం.

కర్కాటకం: కుటుంబంలో కొన్ని విషయాలలో ఒడిదుడుకులు ఉంటాయి.సోదర సోదరీమణులను కలిసి సాధక బాధలు చర్చించుకుంటారు. ఆర్థికంగా అంత అనుకూలమైన సమయం కాదు.

సింహం: ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి- వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య: సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. నూతన ప్రయత్నాలు లాభిస్తాయి.  స్వల్ప ధన లాభం. వివాహయత్నాలు ఫలిస్తాయి.

తుల: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుతుంది.  రుణ బాధలు తప్పవు. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలలో జాప్యం జరిగిన నిదానంగా ఫలిస్తాయి.

వృశ్చికం: విద్యా, ఉద్యోగ అవకాశాలు అనుకూల ఫలితాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు, సంతానం లేని వారికి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మధ్యమ ఫలితాలు ఉంటాయి.

ధనస్సు: రుణాలు తీరీ ఊరట చెందుతారు. గృహాలు, వాహనాలు,వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనయోగం పొందుతారు.వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

మకరం: అనారోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు ముదిరి పాకాన పడతాయి. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త రుణాలు చేయవలసి వస్తుంది.రాబోయే కాలం ఆశాజనకంగా ఉంటుంది.

కుంభం: బంధువులతో ఏర్పడిన ఆర్థిక వివాదాలు పరిష్కరించుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా నిదానంగా పూర్తి చేస్తారు.

మీనం: విందు వినోదాలు,శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మీలో దాగిన ప్రతిభకి మరింత పదును పెట్టి జీవితంలో ముందుకు సాగుతారు. రాబోయే కాలంలో ఆర్థిక అభివృద్ధికి ఇప్పటినుండి దారిని ఏర్పరచుకుంటారు.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News