Tuesday, May 14, 2024

శనివారం రాశి ఫలాలు(27-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. ఆరోగ్య సమస్కలు ఎదురైన అధిగమిస్తారు.

వృషభం – మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వస్తులాభ సూచన.

మిథునం –  కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. పై అధికారులతో జాగ్రతగా ఉండడం మంచిది.

కర్కాటకం – ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం దక్కడం కష్టమే. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు.

సింహం – సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిళ్ళు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. స్వల్ప ధన లాభం.

 కన్య – వృత్తి-వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. అధికారుల నుండి  ఉద్యోగస్తులకి తీపికబురు అందుతుంది. సంతానంకు కార్యసిద్ధి. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు.

తుల – వృత్తి-వ్యాపారాలలో ఎదురైన చికాకులు, అడ్డంకులు తొలుగుతాయి. తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.

 వృశ్చికం – జీవిత భాగస్వామి నుండి ఆర్ధిక లాభం పొందుతారు. వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. వాహన యోగం.

ధనుస్సు – సన్నిహితుల నుండి విలువైన నమాచారం అందుకొంటారు. బంధువుల నుండి కొన్ని విషయాలలో అధిక ఒత్తిడి. వివాదాలకు దూరంగా ఉండండి. స్వల్ప ధనలాభం.

మకరం – పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి-వ్యాపారాలలో లాభాలు పొందుతారు. భూముల క్రయ విక్రయాలలో లాభాల పంట. నూతన వాహన యోగం ఉన్నది.

కుంభం – ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మీ శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. వృత్తి-వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి.

మీనం – ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంతానం నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహనాలు  నడిపే విషయంలో నిర్లక్ష్యం వద్దు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News