Monday, April 29, 2024

నేడే ఇండియా కూటమితో నితీష్ తెగతెంపులు ?

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి , జెడియు నేత నితీష్ కుమార్ ఇండియా కూటమితో తెగతెంపుల ఘట్టం పరాకాష్టకు రాజకీయ ఉత్కంఠతకు దారితీసింది. శుక్రవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో నితీష్ కాంగ్రెస్‌కు దూరం కావడం బీహార్‌లోని మహాఘట్‌బంధన్ ప్రభుత్వం కుప్పకూలడానికి దారితీస్తుందని వెల్లడైంది. అయితే బిజెపితో బేరసారాలు, తిరిగి బిజెపికి మద్దతు నిర్ణయం, బిజెపి బాసటతో ఆదివారం ఆయన బీహార్ సిఎంగా పున ః ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఘట్‌బంధన్‌లో కాంగ్రెస్ కూడా భాగస్వామ్యపక్షంగా ఉంది. బిజెపితో నితీష్ రాజకీయ బేరసారాలు పూర్తి అయినట్లు ఈ క్రమంలో సిఎంగా తిరిగి నితీష్ ఉండటం, బిజెపి నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కావడం వంటి పాత పద్దతి సర్దుబాటు జరిగిందని వెల్లడైంది. శనివారం ఉదయం పది గంటలకు నితీష్ కుమార్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి పిలుపు నిచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఓ వైపు భారీ స్థాయిలో జిల్లా కలెక్టర్ల బదిలీలు ఇతర ఉన్నతాధికారులపై వేటు వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంలో మార్పిడి ప్రచారం జోరందుకుంది. అసెంబ్లీని రద్దుచేయకుండా , ఎన్నికలకు వెళ్లకుండా తిరిగి సిఎం పదవిని చేపట్టడం ఇప్పుడు బిజెపి మద్దతు పొందడం నితీష్ నిర్ణయాలుగా మారాయి. బీహార్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో ఇప్పటికిప్పటి ఎన్నికలకు లేదా లోక్‌సభ ఎన్నికలతో కలిసి ఎన్నికలకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. శుక్రవారం సాయంత్రం నితీష్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిశారు. అయితే ఇది రిపబ్లిక్ డే తేనీటి విందు సందర్భంగా కలయికగా ఉంది. అయితే రాజ్‌భవన్‌కు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ రాలేదు. ఆర్జేడీ నేత మనోజ్ ఝా నితీష్ కుమార్‌ను సాయంత్రం కలిసి పరిస్థితి ఏమిటీ? ఉంటారా? వెళ్లుతారా? అని అడిగినట్లు వెల్లడైంది.

నితీష్‌కు లాలూ నుంచి ఐదుసార్లు ఫోన్
ఉలుకని పలుకని జెడియు నేత?
బిజెపి వైపు నితీష్ మొగ్గు చూపుతున్నారనే వార్తలు కాంగ్రెస్ కన్నా ఆర్జేడీకి కలవరం పుట్టించాయి. ఈ నేపథ్యలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం ఐదుసార్లు నితీష్‌కు ఫోన్ చేసినట్లు, అయితే ఆయన సమాధానం ఇవ్వలేదని వెల్లడైంది. పలుసార్లు సెల్‌ఫోన్ నెంబర్‌కు చేసిన లాలూ విసుగుచెంది చివరికి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేసినట్లు అయినా ఫలితం లేకుండా పోయిందని వెల్లడైంది. కాగా ఆర్జేడీ నేత , ఎంపి మనోజ్ ఝా కూడా నితీష్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News