Sunday, April 28, 2024

ముంబైతో బెంగళూరు సమరం నేడే

- Advertisement -
- Advertisement -

Today match between Mumbai indians vs Bangalore royal challengers

 

అబుదాబి: ప్లేఆఫ్ బెర్త్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు బుధవారం జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇరు జట్లు ఏడేసి విజయాలు సాధించాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కలిగిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరు మూడో స్థానంలో కొనసాగుతోంది ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుకు ప్లేఆఫ్ బెర్త్ దాదాపు ఖరారవుతోంది. దీంతో ఏ జట్టు ముందుగా దీనికి అర్హత సాధిస్తుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇరు జట్ల మధ్య ఇంతకుముందు జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. అయితే అప్పుడూ సూపర్ ఓవర్‌లో బెంగళూరు జయకేతనం ఎగుర వేసింది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా అప్పట్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని ముంబై భావిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. పొలార్డ్, హార్దిక్ పాండ్య వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు ముంబైలో ఉన్నారు.

ఇక బెంగళూరులో అరోన్ ఫించ్, డివిలియర్స్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు ఉన్న విషయం తెలిసిందే. పడిక్కల్, గుర్కిరాత్ సింగ్ వంటి యువ బ్యాట్స్‌మెన్ సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు. ఇక శివమ్ దూబే, మోయిన్ అలీ, క్రిస్ మోరిస్‌ల రూపంలో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. అయితే బ్యాటింగ్‌లో నిలకడలేమి బెంగళూరును కలవరానికి గురి చేస్తోంది. చెన్నైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి మెరుగ్గానే రాణిస్తున్నా అతని బ్యాటింగ్‌లో దూకుడు కనిపించడం లేదు. నెమ్మదిగా ఆడుతూ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాడు. ఈసారైన కోహ్లి దూకుడును పెంచాల్సిన అవసరం ఉంది. పడిక్కల్, ఫించ్, డివిలియర్స్ ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారారు. చాహల్, సిరాజ్, మోరిస్, సుందర్ తదితరులతో బెంగళూరు బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది.

అందరి కళ్లు రోహిత్‌పైనే

మరోవైపు ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న ముంబై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. హార్దిక్ పాండ్య, పొలార్డ్, డికాక్, సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. కిందటి మ్యాచ్‌లో పాండ్య మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. ఇక గాయంతో కిందటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం చాలా సేపు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. దీంతో బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో అతను బరిలోకి దిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి రోహిత్‌పైనే నిలిచింది. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన జట్లలో రోహిత్‌కు చోటు దక్కలేదు. దీంతో అతను ఫిట్‌నెస్‌కు సంబంధించి అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగితే ఆ అనుమానాలకు తెరపడుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News