Saturday, April 27, 2024

తెలుగు వర్సిటీ దూరవిద్యా కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదల

- Advertisement -
- Advertisement -

Telugu varsity distance Education Notification released

 

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 31

మనతెలంగాణ/హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020 -21 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం ద్వారా నిర్వహించే వివిధ కోర్సులలో ప్రవేశాలకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ వర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. వర్సిటీ ఇంఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్ నీతూ కుమారి ప్రసాద్ మంగళవారం దూరవిద్యా కేంద్రం కోర్సులలో ప్రవేశం పొందడానికి వీలుగాఇ ఆన్‌లైన్ ప్రక్రియకు సంబంధించిన పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ ఏడాది దూరవిద్యా కేంద్రం ద్వారా టి.వి.జర్నలిజం, జ్యోతిర్వాస్తులను, లలిత సంగీతం, ఫిల్మ్ రైటింగ్, సంగీత విశారద, ఆధునిక తెలుగు, జ్యోతిష్యం కోర్సులను నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేష్ తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా నవంబర్ 31లోపు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. ఆలస్య రుసుంతో డిసెంబర్ 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు దూరవిద్యా కేంద్రం సంచాలకులు సిహెచ్ మురళీకృష్ణ అన్నారు. పూర్తి వివరాలకు తెలుగు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.teluguuniversity.ac.in చూడాలని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News