Monday, April 29, 2024

కాజల్ పెళ్లి సందడి షురూ.. 29న హల్దీ, మెహెందీ వేడుకలు

- Advertisement -
- Advertisement -

కొద్ది రోజుల్లో స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈనెల 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లును ఆమె పెళ్లి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 29న హల్దీ, మెహెందీ వేడుకలను నిర్వహించబోతున్నట్లు కాజల్ సోదరి, నటి నిషా అగర్వాల్ తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ.. “కరోనాను దృష్టిలో పెట్టుకొని వివాహ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించ నున్నాం. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ… సంప్రదాయబద్ధంగా హల్దీ, మెహెందీ వేడుకలను ఇంట్లోనే జరుపుతాం. ఇక కాజల్ పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోతుండటం బాధగా ఉంది. దీంతో వీలైనంత సమయం అక్కతో గడిపేందుకు ప్రయత్ని స్తున్నాం” అని పేర్కొంది.

Kajal’s Mehendi Ceremony on Oct 29

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News