Saturday, May 4, 2024

టమాటాకు ఇక టాటా!

- Advertisement -
- Advertisement -

Tomato Price 100 on at Madanapalle Market

భగ్గుమంటున్న ధరలు, వర్షాలతో దెబ్బతిన్న పంటలు, తగ్గిన దిగుబడి, పెరిగిన గిరాకీ కిలో రూ.80,

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. గతంలో ఎన్నూడు లేని విధంగా టామాటా ధరలు దీపావళి బాంబుల్లా పేలుతున్నాయి. కిలో టామాటా రూ.80కి చేరింది. దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా మార్కెట్‌కు పేరుగాంచిన ఎపిలోని మదన పల్లి మార్కెట్‌లో బుధవారం నాడు టమాటా ధర సెంచరీ కొట్టేసింది. తెలంగాణ రాష్ట్రసరిహద్దుల్లోని తుంగభద్ర నదికి ఆవలివైపున ఉన్న పత్తికొండ మార్కెట్‌లో సైతం కిలో టామాటా రూ.60కి చేరింది. పక్కరాష్టంలో పెరిగిన టామాటా ధరలు తెలంగాణ రాష్ట్ర మార్కెట్లపై కూడా ప్రభా వం చూపుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్‌కు ఆంధప్రదేశ్ నుంచే టామాటా అధికంగా దిగుమతి అవుతుంది. తెలంగాణలో టమాటా సాగు ఇక్కడి అవసరాలను తీర్చేంతగా లేకపోవటంతో ఎపిలోని కర్నూలు , పత్తికొండ, ఆదోని , ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలనుంచి ఇక్కడికి టామాటా పెద్ద ఎత్తన విక్రయానికి వస్తోంది. సరుకు రవాణా చార్జీ లు కలిపి ఇక్కడికి చేరేసరికి ఆ ప్రభావం టామాటా ధరలు మరింతగా పెరిగేందుకు దారితీస్తోంది. అకా ల వర్షాల కారణంగా టమాటా పంటలు దెబ్డతిన్నాయి.

దిగుబడి కూడా బాగా తగ్గిపోయ మార్కెట్లకు సరుకు రాక తగ్గిపోయింది. దీంతో అరకొరగా వస్తున్న టమాటాను కొనుగొలు చేసేందుకు వ్యాపారులు పోటీలు పడుతుండటంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలోని రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, నల్లగొండ, మెదక్ తదితర జిల్లాల్లో కూరగాయా పంట లు దెబ్బతిన్నాయి. పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఈ ప్రాంతాల నుంచి వస్తున్న కూరగాయలు, అకు కూ రల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. పచ్చిమిరప కూడా రెండు రోజులుగా మరింతగా మంటపుట్టిస్తోంది. కిలో మిరప రూ.60కి చేరింది. మిగిలిన కూరగాయల ధరలు కూడా అదే బాటాలో ఎగబాకుతున్నాయి. కిలో ఉల్లి రూ.60కి చేరింది. బెండకాయలు రూ.40, వంకాయలు రూ. 40, బీరకాయలు రూ.50, చిక్కుడ రూ.50 బీన్స్ రూ.40, కాకర రూ.35, దొండకాయ రూ.35, ఆలు రూ.25, క్యారెట్ రూ.40 చేరుకున్నాయి. రాష్ట్రంలో కూరగాయల వినియోగానికి తగినట్టుగా పంటల సాగు విస్తీర్ణం పెరగటం లేదు. రాష్ట్ర అవసరాలు తీరాలంటే అన్ని రకాల కూరగాయల పంటల సాగు విస్తీర్ణం 4లక్షల ఎకరాలకు పెరగాల్సివుంది.

అయితే ప్రభుత్వం ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నా కాలం కలిసి రావటం లేదు. ప్రకృతి వైపరిత్యాలు కూరగాయల రైతు ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నాయి. దీంతో ఈ పంటసాగుకు కొత్త రైతులు అంతగా ఉత్సాహం చూపలేకపోతున్నారు. రాష్ట్రంలో వర్షాకాలం కూరగాయాల సాగు సాధారణ విస్తీర్ణం కంటే 10వేల ఎకరాలు తగ్గింది. హైదరాబాద్ నగర పరిసర జిల్లాల్లోనే కూరగాయాల సాగు అధికంగా జరుగుతోంది. రాష్ట్రమంతటా కలిపి వానాకాల సీజన్ కింద 75వేల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయ పంటలు సాగు చేశారు.

పెరుగుతున్న కూరగాయల ధరలు కిందకు దిగాలంటే మరో వారం పదిరోజులు ఆగాల్సిందేనని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. అధిక వర్షాల వల్లే పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గిందని తెలిపారు. చలి వాతావరణం పెరిగేకొద్ది పంటలు తిరిగి కోలుకుని దిగుబడి పెరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. యాసంగి పంట కింద కూరగాయల సాగు విస్తీర్ణం ఈ సారి లక్ష ఎకరాలకు చేరుకుంది. యాసంగి పంట కూడ మరో రెండు వారాల్లో మార్కెట్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. కొత్త పంట మార్కెట్‌లోకి వస్తే అన్ని రకాల కూరగాయల ధరలు తగ్గుముఖం పడతాయని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News