Friday, April 26, 2024

అందాలతో అదరగొడుతున్నారు

- Advertisement -
- Advertisement -

tollywood-heroines

అందాల భామలు అవకాశాల కోసం పోటీపడుతుంటారు. మంచి సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకోవాలని వారు తహతహలాడుతుంటారు. ఈ నేపథ్యంలో హీరోయిన్లు ఫిల్మ్‌మేకర్స్ దృష్టిలో పడేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. హాట్ ఫొటో షూట్లతో సందడి చేస్తున్నారు కథానాయికలు. ఒకరిని మించి మరొకరు హాట్ ఫొటో షూట్లతో అదరగొడుతున్నారు.

సోషల్ క్వీన్స్‌గా నిలిచేందుకు హీరోయిన్లు తమ గ్లామర్ ఫొటోలతో విరుచుకుపడుతున్నారు. మ్యాగజైన్ కవర్ ఫొటోలతో పాటు వ్యక్తిగత జీవితాల్లోని చాలా సంగతులు, కుటుంబ వేడుకల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఇటీవల స్టార్ బ్యూటీలు కాజల్ అగర్వాల్, సమంతలు హద్దులు మీరి గ్లామర్ ఫొటోలతో హల్‌చల్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామలు దూసుకుపోతున్నారు. రెగ్యులర్‌గా హాట్ ఫొటో షూట్లతో వైరల్ అయిపోతున్నారు. ఇక నవతరం భామల్లో రకుల్‌ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, రాశీఖన్నా, అనుపమ పరమేశ్వరన్ తదితరులు ఎప్పటికప్పుడు ఫొటోషూట్లను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.

టీనేజీ భామలు నభా నటేష్, నిధి అగర్వాల్ మధ్య ఒకటే పోటీ నెలకొంది. సోషల్ మీడియాలో ఈ భామల అందాల ఆరబోతకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అయితే సోషల్ రేస్‌కు అనుష్క, కీర్తి సురేష్ వంటి భామలు దూరంగానే ఉన్నారు. బాలీవుడ్ వాతావరణం ఇప్పుడు సౌత్‌లోనూ కనిపిస్తోందనడానికి సోషల్ మీడియానే నిదర్శనం.

Top tollywood heroines 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News