Tuesday, May 14, 2024

తెలంగాణ రైతు లోకానికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రైతు లోకానికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ, రైతు వ్యతిరేక విధానాలపై రేవంత్ కార్యాచరణకు పిలుపునిచ్చారు. రైతు వేదికలు ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా మారాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం వాటిని రాజకీయ వేదికలుగా మార్చాలని చూస్తుందన్నారు. రైతు రుణ మాఫీ కోసం ఇన్నాళ్లు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశామని, చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టిందని, ఇక రుణమాఫీ చేయబోదన్న విషయం స్పష్టమయ్యిందన్నారు.

రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అక్షరాలా 31 లక్షలని, రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందన్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. జూన్ 15వ తేదీ నాటికి రూ.6,800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయన్నారు. తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుంచి ప్రభుత్వం లాక్కుందని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని తేలినా కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే పట్టాలు ప్రభుత్వం ఇచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు ఫ్రీగా ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు ఇవ్వడం లేదని, సబ్ స్టేషన్‌లో లాగ్‌బుక్‌లే దీనికి సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. అందుకే అన్ని సబ్ స్టేషన్‌లలో లాగ్‌బుక్‌లను వెనక్కు తెప్పించుకుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News