Tuesday, April 30, 2024

గోల్కొండ కోట సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -
Traffic restrictions near Golconda Fort
ఆదేశాలు జారీ చేసిన నగర అదనపు సిపి అనిల్‌కుమార్

హైదరాబాద్: గోల్కోండ కోటలో ఆదివారం భోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ ఫోర్ట్ వయా మక్కీ దర్వాజా, లంగర్‌హౌస్ నుంచి గోల్కొండ కోట వయా ఫతే దర్వాజా, సెవెన్ టూంబ్స్, గోల్కొండ, గోల్కొండ కోట వయా బంజారా దర్వాజా వైపు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. భోనాలకు చుట్టుపక్కల ఉన్న భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఆంక్షలు విధించారు. వాహనదారులు ఈ మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. భక్తులు వాహనాలను రాందేవ్ గూడ జంక్షన్ మెయిన్ రోడ్డుపై నిలుపాలి. లంగర్‌హౌస్ నుంచి వచ్చే వాహనాలు సాలార్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో లేదా ఓవైసి గ్రౌండ్‌లో నిలుపాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News