Sunday, May 12, 2024

ఎల్బీ నగర్ లో గిరిజన మహిళపై దాడి…

- Advertisement -
- Advertisement -
సిసిటివి పుటేజీని సమర్పించాలని హైకోర్టు ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో గిరిజన మహిళ లక్ష్మిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి సిసిటివి పుటేజీని సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 15వ తేదీన ఎల్బీ నగర్ పోలీసులు గిరిజన మహిళ లక్ష్మిపై దాడి చేశారు. తనపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారని లక్ష్మి ఆరోపించారు.ఈ విషయమై మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై జడ్జి సూరేపల్లి నంద హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. దీంతో ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుంది. మంగళవారం ఈ ఘటనపై హైకోర్టు విచారణ నిర్వహించింది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ బయట, లోపల ఉన్న సిసిటివి పుటేజీని అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. మీర్‌పేటకు చెందిన లక్ష్మిని ఎల్బీ నగర్ పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై రాచకొండ సిపి చౌహాన్ విచారణకు ఆదేశించారు. విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎల్బీ నగర్ పోలీసులపై కేసు నమోదైంది. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ యాక్ట్ తో పాటు ఇతర సెక్షన్ల కింద కూడ కేసులు నమోదు చేశారు. రాత్రంతా నిర్భంధించి తనపై పోలీసులు దాడి చేశారని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయమై బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఈ నెల 16న ఆందోళనకు దిగారు. ఈ విషయమై మంత్రి సత్యవతి రాథోడ్ రాచకొండ సిపితో ఫోన్ లో మాట్లాడారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని కూడా కోరారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో ముగ్గురు మహిళలు ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వచ్చి తీసుకెళ్లి దాడి చేశారని బాధితురాలు ఆరోపించారు. బాధితురాలికి న్యాయం చేయాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News