Sunday, April 28, 2024

‘ఎస్‌సి వర్గీకరణపై’ ఎందుకింత జాప్యం?

- Advertisement -
- Advertisement -

TRS party concerns in Lok Sabha seeking to take up SC classification

చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశంపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు?

వర్గీకరణపై ఎందుకు ఆమోదముద్ర వేయడం లేదు?

ఎందుకు తొక్కిపెడుతున్నారో
చెప్పాలి : లోక్‌సభలో నామా
ప్రశ్న మాట్లాడడానికి
అవకాశమివ్వని స్పీకర్ ఈ
అంశంపై ఎంపిల
వాయిదా తీర్మానం తిరస్కృతి
సభ నుంచి వాకౌట్ మీడియా
సమావేశంలో మాట్లాడిన ఎంపిలు
వర్గీకరణపై ఎనిమిదేళ్ల క్రితమే
టిఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో
తీర్మానం చేసి కేంద్రానికి
పంపించింది బిజెపి ప్రభుత్వానికి
చేతకాకపోతే ఆ అధికారం
మాకివ్వండి 24 గంటల్లో
వర్గీకరణకు ఆమోదం తెలుపుతాం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎస్‌సి వర్గీకరణ చేపట్టాలని కోరుతూ లోక్‌సభలో టిఆర్‌ఎస్ పార్టీ గురువారం ఆందోళన చేసింది. తక్షణమే ఈ అంశంపై చర్చ జరగాలని పార్టీ ఎంపిలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని పార్టీ నేత నామా నాగేశ్వర్‌రావు లేవనెత్తారు. చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్‌సి వర్గీకరణను కేంద్రం ఎందుకు ఆమోందించడం లేదని ప్రశ్నించారు. దీనిని ఎందుకు తొక్కిపెడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే నామా మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో….టిఆర్‌ఎస్ ఎంపిలు ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని అందజేశారు. దీనికి కూడా స్పీకర్ తిరస్కరించడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ టిఆర్‌ఎస్ ఎంపిలు సభ నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో ఎంపి నామా నాగేశ్వర్‌రావు మాట్లాడూతూ, దళిత వర్గాలకు చట్టబద్ధమైన ప్ర యోజనాలు అందాలన్న లక్షంతో టిఆర్‌ఎస్ ప్రభు త్వం ఎనిమిదేళ్ల క్రితం ఎస్‌సి వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. ఈ అంశం పై పార్లమెంట్ సమావేశాల్లో పలుమార్లు కేంద్రం దృ ష్టికి తీసుకెళ్లినప్పటికీ విధంగా స్పందన రాకపోవ డం విచారకరమని నామా వ్యాఖ్యానించారు. ఈ వర్గీకరణనను ఆమోదించడంలో కేంద్రానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. దళిత వర్గాలకు మరిన్ని ప్రయోజనాలు అందకూడదా? అని ఆయన రు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్‌సి వర్గీకరణ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ఎనిమిదేండ్లుగా అణగారిన వర్గాలను మోసం చేస్తోందని నామా విమర్శించారు.

అణగారిన కులాలను మోడీ ప్రభుత్వం ఇంకా అణగదొక్కుతూనే ఉందని మంచిపడ్డారు. బిజెపి నాయకులకు చేతకాకపోతే….ఆ అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అలా కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఎస్‌సి వర్గీకరణ సమస్యను కేవలం 24 గంటల్లో పరిష్కారం తీసుకొస్తామన్నారు. ఎస్‌సి వర్గీకరణ అసెంబ్లీ తీర్మానంపై సిఎం కెసిఆర్ పలుమార్లు ప్రధాని మోడీకి లేఖలు కూడా రాశారని ఈ సందర్భందగా ఆయన గుర్తు చేశారు. మంత్రుల బృందం కూడా కేంద్ర మంత్రులను కలిసిందన్నారు. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు. ఎస్‌సిలను బిజెపి ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. దళిత బంధు తరహాలో కేంద్రం కూడా ఎస్‌సిలకు పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

75 సంవత్సరాల స్వాతంత్య్ర దేశంలో ఎస్‌సిలు అణచివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అణిచివేత నుంచి వారికి విముక్తి కల్పించాలన్న లక్షంతోనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందన్నారు. అనేక రాష్ట్రాలు కూడా టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఎస్‌సివ వర్గీకరణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయని నామా పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఉలుకు…పలుకు లేకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రం కేవలం ధనవంతులకే కొమ్ము కాస్తూ….ఇతర వర్గాలను పూర్తిగా నిర్లక్షం చేస్తోందన్నారు. ఎస్‌సిల అభ్యున్నతిపై మోడీ ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధిలేని చెప్పడానికి ఇదో నిదర్శనమని ఆయన మండిపడ్డారు.

ఎస్‌సిల సమస్యల మీద మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభలో స్పీకర్‌ను పలుమార్లు కోరినప్పటికీ, ఆయన స్పందించలేదని నామా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చట్టసభలు అంటే అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలపై చర్య చేపట్టాల్సి ఉంటుందన్నారు. వారి కోసం మెరుగైన విధానాలు తీసుకరావాల్సి ఉంటుందన్నారు. కానీ ఈ అంశాన్ని ఎప్పుడు సభలో లేవనెత్తాలని చూసినా కేంద్రం నుంచి తగు సహకారం లభించడం లేదని ఆయన మండిపడ్డారు. ఎస్‌సిలలో 59 ఉపకులాలు ఉన్నాయని… వారి జనాభా ప్రతిపాదికన ఆధారంగా వారికి న్యాయం జరగాలన్నారు. అధికారం పెత్తనం కేంద్రం దగ్గర పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఇకనైనా కేంద్రం తన విధానాలను మార్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో టిఆర్‌ఎస్ పక్షాన మరింత ఆందోళనలను ఉధృతం చేస్తామని నామా హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపిలు రాములు, రంజిత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ ఎంపీలతో కలిసి ఆయన అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులు పట్టుకుని నానాదాలు చేశారు. ఎస్‌సి వర్గీకరణను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News