Wednesday, May 8, 2024

ట్రంప్ త్వరలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెడతారు

- Advertisement -
- Advertisement -

Trump starts second inning: Pompeo

 

వాషింగ్టన్ : ప్రెసిడెంట్ ట్రంప్ రెండో దఫా అధికార స్వీకరణ సజావుగా సాగుతుందని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. తమ నేత ట్రంప్ తిరుగులేని విజయం సాధించినట్లు తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ సాగుతోందని , ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని తెలిపారు. ట్రంప్ అధికార యంత్రాంగం రెండో దఫాకు ఎటువంటి ఇబ్బంది లేదని, అధికార మార్పిడి మునుపటిలాగానే సజావుగా సాగుతుందని తేల్చిచెప్పారు. ట్రంప్ ఓడి, బైడెన్ దేశాధ్యక్షులు అయినట్లు యుఎస్ మీడియా ప్రకటించిన దశలో ట్రంప్ టీంలో ప్రధాన వ్యక్తి తమ అధికారమే ఇక ముందూ కొనసాగుతుందని చెప్పడం ప్రధానాశం అయింది. ఫాగీ బాటమ్ విదేశాంగ కార్యాలయపు హెచ్‌క్వార్టర్‌లో విధుల నిర్వహణలో ఉన్న పాంపియోను మీడియా ప్రతినిధులు కలిశారు.

అధికార మార్పిడికి సహకరిస్తున్నారా? లేదా ఎంత కాలం జాప్యం జరుగుతుంది? లేదా అడ్డుకుంటారా? దీని వల్ల తలెత్తే జాతీయ భద్రతా విపత్తుల మాటేమిటీ? అనే ప్రశ్నలను ట్రంప్ టీం ముందు విలేకరులు ఉంచారు. అయితే అధికార మార్పిడి అనేది కేవలం ట్రంప్ రెండో దఫా అధికార స్వీకారానికే అని పాంపియో స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రపంచదేశాలన్ని నమ్మకంతో ఉండాలని , తాము పదవీబాధ్యతలను యధావిధిగా కొనసాగిస్తున్నామని, తమ ట్రంప్ అధికార యంత్రాంగం సజావుగా మునుపటిలాగానే బాధ్యతల స్వీకరణకు సమాయత్తం అవుతోందన్నారు. దేశానికి ట్రంప్ 2 పాలననే వస్తోందని తెలిపారు.

అన్ని ఓట్లనూ లెక్కించాల్సిందే అన్నారు. 2000 సంవత్సరంలో దేశంలో ఎన్నికల ప్రక్రియ సంపూర్తికి 37రోజులు పట్టిందన్నారు, ఈసారి కూడా చట్టబద్ధమైన ప్రతి ఓటూ లెక్కింపు జరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు తేల్చివేశారు. పాంపియో ఏడు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లుతున్నట్లు కూడా ప్రకటించారు. ఇది తమ నేత ట్రంప్ ఇంతకుముందటి ఆదేశాల మేరకు జరుగుతుందన్నారు. పశ్చిమాసియాలో సుస్థిర శాంతిస్థాపన దిశలో ఆయా దేశాధినేతలతో సంప్రదింపులు సాగుతూనే ఉంటాయని, ఇవి ఆగబోవని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News